రూ. 24,375 కోట్ల నిధులతో 75 మెడికల్ కాలేజీలు

రూ. 24,375 కోట్ల నిధులతో 75 మెడికల్ కాలేజీలు

Last Updated : Aug 28, 2019, 11:20 PM IST
రూ. 24,375 కోట్ల నిధులతో 75 మెడికల్ కాలేజీలు

న్యూఢిల్లీ: కేంద్రం బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైన వాటిలో దేశవ్యాప్తంగా కొత్తగా 75 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఒకటి. రానున్న మూడేళ్లలో 75 మెడికల్ కాలేజీల ఏర్పాటు, అభివృద్ధి కోసం రూ. 24, 734 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కనీసం 200 పడకల జిల్లా ఆసుపత్రి లేని ప్రాంతాలు, అలాగే 300 పడకలు కలిగిన జిల్లా ఆసుపత్రులున్న ప్రాంతాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో తొలి దశ కింద ఇప్పటికే 58 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. రెండో దశలో మరో 24 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీల రాకతో కొత్తగా 15,700 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. 
    
గడిచిన ఐదేళ్లలో 45 వేల ఎంబీబీఎస్‌ సీట్లు పెంచినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన డాక్టర్ల సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 82 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు.

Trending News