Covid-19: అమర్‌నాథ్ యాత్ర రద్దు

భారత్‌లో కరోనా వైరస్ ( coronavirus ) వ్యాప్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది.

Last Updated : Jul 22, 2020, 06:55 AM IST
Covid-19: అమర్‌నాథ్ యాత్ర రద్దు

Amarnath Yatra-2020: ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( coronavirus ) వ్యాప్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో అమర్‌నాథ్ యాత్ర ( Amarnath Yatra ) నిర్వహించడం అంత మంచిది కాదని, అందుకే ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్లు బోర్డు అభిప్రాయపడింది. Also read: Rajasthan: సచిన్ పైలట్ వర్గానికి ఊరట

మంగళవారం జమ్మూకాశ్మీర్ ( Jammu and Kashmir ) లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము (G. C. Murmu) ఆధ్వర్యంలో జరిగిన అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు (SASB) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, ఈ క్రమంలో యాత్ర నిర్వహించడం వల్ల వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తుల కోసం ఉదయం, సాయంత్రం వర్చువల్ దర్శనాన్ని మాత్రం యాథాతథంగా కొనసాగిస్తామని బోర్డు వెల్లడించింది.

అయితే జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఈ యాత్ర నిర్వహించాలని ప్రభుత్వం, బోర్డు ముందుగా భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉంటే గతేడాది జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో ఈ అమర్‌నాథ్ యాత్ర మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. Also read: Mamata: యూపీ,కేంద్రంపై విరుచుకుపడిన మమతా బెనర్జీ

Trending News