Policeman's Bowling Skills Viral Video: ఒకప్పుడు లోకల్‌కే పరిమితమైన ఈ టాలెంట్, లేదా క్రికెట్ స్కిల్స్.. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి ఎక్కడ, ఎవరిలో, ఎలాంటి ప్రతిభ దాగి ఉన్నా.. అది వారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తమవుతోంది. తాజాగా ఒక పోలీసు వేగంగా బౌలింగ్ చేస్తూ కళ్లు మూసి తెరిచేలోగా వికెట్లు పడగొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IPL 2024: ఐపీఎల్ గత రెండు సీజన్లలో ఘోరంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇటీవల కొంతమంది ఆటగాళ్లను పక్కనబెట్టిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Ishant Sharma: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే కాదు..విదేశాల్లో సైతం అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. వ్యక్తిగతం కంటే ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
IPL Winners List: ఐపీఎల్ 2023 ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రారంభమై ఇప్పటి వరకూ 16 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా పేరుగాంచింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకూ ఎవరెవరు టైటిల్ విజేతగా నిలిచారో తెలుసుకుందాం..
Update on Mahindra Singh Dhoni Retirement: ఐపీఎల్ 2023 మహా పోరు ముగిసింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య అత్యంత రసవత్తరంగా జరిగిన ఫైనల్ పోరులో చెన్నై విజయం సాధించింది. ధోనీ కెరీర్లో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న ఘనత సాధించాడు.
IPL 2023 Final: ఐపీఎల్ 2023 తుది సమరం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. వరుసగా రెండవసారి టైటిల్ సాధించేందుకు గుజరాత్ టైటాన్స్, ఐదవ టైటిల్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు సర్వ శక్తులూ ఒడ్డనున్నాయి. గుజరాత్ అహ్మాదాబాద్ వేదికగా ఐపీఎల్ 2023 తుదిపోరు జరగనుంది.
IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ఇవాళ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య తుది పోరు అహ్మాదాబాద్ వేదిక సిద్ధమైంది. క్లైమాక్స్ పోరు అనంతరం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
IPL 2023: ఐపీఎల్ 2023 ఫైనల్ పోరు ఎవరెవరితో తేలిపోయింది క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. శుభమన్ గిల్ విధ్వంసక శతకం ముంబై ఆశలపై నీళ్లు చిమ్మేసింది.
IPL 2023 GT vs MI: ఐపీఎల్ 2023 కీలకదశకు చేరుకుంది. మరో రెండ్రోజులు..రెండు మ్యాచ్‌లతో 60 రోజుల వేడుక ముగియనుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. చెన్నైతో పోటీ పడేది డిఫెండింగ్ ఛాంపియనా లేదా 5 సార్లు టైటిల్ గెల్చుకున్న జట్టా అనేది తేలనుంది.
Naveen Ul Haq Vs Virat Kohli Fans: ఈ సీజన్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం ఒక్కసారిగా హీట్ పుట్టించింది. వీరిద్దరి మధ్య గొడవ తరువాత కోహ్లీ సైలెంట్ అయినా.. నవీన్ మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ముంబై చేతిలో లక్నో ఓటమి తరువాత నవీన్‌పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది.
IPL 2023: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్‌కింగ్స్ రికార్డు నెలకొల్పింది. మరే జట్టుకు సాధ్యం కాని ఫీట్ సాధించింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 10 సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా ఖ్యాతినార్జించింది. పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి.
IPL 2023 QF-1: ఐపీఎల్ 2023 క్వాలిఫర్-1 మ్యాచ్‌పై ఇప్పుడు వివాదం ప్రారంభమైంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నెటిజన్లు ఈ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
IPL 2023 Updates: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్‌కింగ్స్..డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టి కరిపించింది. క్వాలిఫయర్-1లో విజయతో ఫైనల్లో దూసుకెళ్లింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేక గుజరాత్ టైటాన్స్ బోల్తా పడింది.
MI vs SRH : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై గెలిచింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ.. హైద్రాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై టీం గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైద్రాబాద్ 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.
IPL 2023: ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుతోంది. ఇప్పుటికే ఒక్కొక్కటిగా టీమ్స్ ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకుంటే మరికొన్ని జట్లు నిష్క్రమిస్తున్నాయి. తాజాగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఢిల్లీ కేపిటల్స్‌పై భారీ విజయంతో ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకుంది.
Suryakumar Yadav IPL Runs: ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. అనంతరం ముంబై 4 వికెట్ట్ కోల్పోయి కేవలం 16.3 ఓవర్లలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (83) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు నేహాల్ వధేరా (52), ఇషాన్ కిషన్ (42) ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.
Most Ducks in IPL History: కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు వీళ్లే..!
CSK vs MI: Rohit Sharma has the highest number of ducks in IPL. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరుపై ఓ అత్యంత చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్ రోహితే.
Rohit Sharma's Bromance With Shikhar Dhawan: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గతంలో టీమిండియాకు స్ట్రాంగ్ ఓపెనర్స్. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్‌కి వచ్చారంటే.. అది ఏ ఫార్మాట్ అయినా సరే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. అందుకే ఈ ఓపెనర్స్ జోడీ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం. అలా ప్రత్యర్థి జట్టు బౌలర్లను వణికించిన ఈ జోడీ ఐపిఎల్ 2023 లో వేర్వేరు జట్లకు కేప్టేన్స్గా వ్యవహరిస్తున్నారు.
MS Dhoni Retirement News: ఐపిఎల్ 2023 సీజన్ సగం దాటి రెండో హాఫ్ నడుస్తుండగా బుధవారం లక్నోలోని ఎకాన స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ వేసే సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ సగంలో రద్దయినప్పటికీ.. ధోనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడం మాత్రం ఆగలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.