MI vs PBKS Match: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం

Rohit Sharma's Bromance With Shikhar Dhawan: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గతంలో టీమిండియాకు స్ట్రాంగ్ ఓపెనర్స్. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్‌కి వచ్చారంటే.. అది ఏ ఫార్మాట్ అయినా సరే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. అందుకే ఈ ఓపెనర్స్ జోడీ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం. అలా ప్రత్యర్థి జట్టు బౌలర్లను వణికించిన ఈ జోడీ ఐపిఎల్ 2023 లో వేర్వేరు జట్లకు కేప్టేన్స్‌గా వ్యవహరిస్తున్నారు.

Written by - Pavan | Last Updated : May 3, 2023, 10:18 PM IST
MI vs PBKS Match: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం

Rohit Sharma's Bromance With Shikhar Dhawan: ఐపిఎల్ 2023 లో భాగంగా మొహాలి స్టేడియంలో బుధవారం ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 46వ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పాయింట్ల పట్టికలో స్థానం కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు హోరాహోరీగా తలపడుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ వేసే సందర్భంగా ముంబై ఇండియన్స్ కేప్టేన్ రోహిత్ శర్మ, పంజాబ్ కింగ్స్ జట్టు కేప్టేన్ శిఖర్ ధావన్ తమ బ్రోమాన్స్ ని చూపించుకున్నారు. 

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గతంలో టీమిండియాకు స్ట్రాంగ్ ఓపెనర్స్. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్‌కి వచ్చారంటే.. అది ఏ ఫార్మాట్ అయినా సరే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. అందుకే ఈ ఓపెనర్స్ జోడీ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం. అలా ప్రత్యర్థి జట్టు బౌలర్లను వణికించిన ఈ జోడీ ఐపిఎల్ 2023 లో వేర్వేరు జట్లకు కేప్టేన్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య టాస్ వేసే సందర్భంలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. తాను ఏం ఎంచుకోవాలని కోరుకుంటున్నావు అని శిఖర్‌ ధావన్‌ని అడిగాడు.

రోహిత్ శర్మ అడిగిన ఈ ప్రశ్నకు ఏ మాత్రం ఆలస్యం చేయని శిఖర్ ధావన్.. బౌలింగ్ ఎంచుకొమ్మని సూచించాడు. తాము అయితే ముందుగా బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపే వాళ్లం అని రోహిత్ శర్మకు శిఖర్ ధావన్ బదులిచ్చాడు. ఇదే విషయమై అక్కడే ఉన్న లేడీ బ్రాడ్‌కాస్టర్ మాట్లాడుతూ.. శిఖర్ ధావన్‌ని ఏం అడిగావు.. అతడు ఏం చెప్పాడు అంటూ రోహిత్ శర్మను అడిగింది. బ్రాడ్ కాస్టర్ అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ స్పందిస్తూ.. తమ మధ్య ఏం జరిగిందో చెప్పాడు. టాస్ గెలిచాను కనుక ఏం ఎంచుకుంటే బాగుంటుంది అని అడిగితే.. బౌలింగ్ ఎంచుకోవాల్సిందిగా చెప్పాడని.. ఒకవేళ మేం గెలిచినా కూడా అదే చేసే వాళ్లమని ధావన్ చెప్పుకొచ్చాడు.  

ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితా : రోహిత్ శర్మ ( కేప్టేన్ ) , ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్ ) , కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్

పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల జాబితా : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ ( కేప్టేన్ ), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ ( వికెట్ ), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

Trending News