IPL 2023 GT vs MI: క్వాలిఫయర్ 2 పైనే అందరి దృష్టి, గెలుపోటముల్ని శాసించేది వీళ్లే

IPL 2023 GT vs MI: ఐపీఎల్ 2023 కీలకదశకు చేరుకుంది. మరో రెండ్రోజులు..రెండు మ్యాచ్‌లతో 60 రోజుల వేడుక ముగియనుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. చెన్నైతో పోటీ పడేది డిఫెండింగ్ ఛాంపియనా లేదా 5 సార్లు టైటిల్ గెల్చుకున్న జట్టా అనేది తేలనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2023, 05:19 PM IST
IPL 2023 GT vs MI: క్వాలిఫయర్ 2 పైనే అందరి దృష్టి, గెలుపోటముల్ని శాసించేది వీళ్లే

IPL 2023 GT vs MI: ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగింది. భారీ పరుగులు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ సీజన్ 16 నిలిచిపోనుంది. స్కోరు 200 దాటినా సులభంగా ఛేజింగ్ చేసిన జట్లున్నాయి. ఇవాళ జరగనున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2 కీలకం కానుంది. ఈ నేపధ్యంలో ఆట గెలుపోటముల్ని ప్రభావితం చేసే ఆ ఆటగాళ్లపైనే అందరూ దృష్టి సారించారు. 

మరి కాస్సేపట్లో ప్రారంభం కానున్న అత్యంత కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌తో ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడే జట్టు నిర్ధయం కానుంది. క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో ఫైనల్‌లో దూసుకెళ్లిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సైతం ఇవాళ్టి మ్యాచ్‌పై దృష్టి సారించింది. అటు ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించిన ముంబై ఇండియన్స్..గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అందుకే ఇవాళ అందరి దృష్టి ఈ రెండు జట్లకు చెందిన ఆరుగురు కీలక ఆటగాళ్లపై పడింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ సన్నద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు పైనల్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడుతుంది. అందుకే ఇవాళ్టి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

ముంబై ఇండియన్స్ జట్టు సారధి రోహిత్ శర్మతో పాటు బ్యాటర్లు ఇయాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, బౌలర్ ఆకాష్ మద్వాల్ ఎలా రాణిస్తారనే దానిపైనే ఆ జట్టు గెలుపోటములు నిర్ణయం కానున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి అత్యంత విలువైన బౌలర్‌గా మారిన ఆకాష్ మద్వాల్ ఇవాళ్టి మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడోననేది ఆసక్తిగా మారింది. లక్నో జట్టును ఇంటికి పంపించడంలో ఇతనిదే కీలకమైన భూమిక. 

ఇక ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇయాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ , తిలక్ వర్మలు బ్యాట్ ఎలా ఝులిపిస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ మరోసారి రాణిస్తే ముంబైకు తిరుగుండదు. సూర్యకుమార్ యాదవ్ 15 మ్యాచ్‌లలో 500 పరుగుల మార్క్ దాటేశాడు. అత్యంత వేగవంతమైన స్ట్రైక్ రేట్ ఇతని సొంతం. ఇక మరోవైపు రోహిత్ శర్మ, ఇయాన్ కిషన్, తిలక్ వర్మ కుదురుగా ఆడితే ముంబై బ్యాటింగ్‌కు తిరుగుండదు. 

ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ ఆశలన్నీ శుభమన్ గిల్‌పై పెట్టుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ రెండు సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు జాబితాలో ఉన్నాడు. ఇవాళ శుభమన్ గిల్ ఎలా రాణిస్తాడనేదానిపై గుజరాత్ టైటాన్స్ విజయం ఆధారపడి ఉంటుంది. అతనితో పాటు కెప్టెన్ హార్డిక్ పాండ్యా  కూడా ఫామ్‌లో ఉన్నాడు. వికెట్‌పై నిలబడగలిగితే ఇక తిరుగుండదు. మరోవైపు స్పిన్నర్ కమ్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరుతెచ్చుకున్న రషీద్ ఖాన్‌పై అందరూ ప్రత్యేక దృష్ఠి సారించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ 25 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా చివర్లో వచ్చి భారీ సిక్సర్లు, బౌండరీలతో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే సత్తాతో ప్రత్యర్ధులకు సవాలు విసురుతున్నాడు.

ఇక గుజరాత్ టైటాన్స్ జట్టుకు బౌలింగ్ పరంగా మంచి ఎస్సెట్ మొహమ్మద్ షమి. ఈ సీజన్‌లో షమీ 26 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్‌లో కన్పిస్తున్నాడు. క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ ముఖ్యమైన ఆటగాడిగా మారనున్నాడు.

Also read: ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 2 మ్యాచ్.. గుజరాత్‌పై ముంబై గెలవాలంటే ఆ ప్లేయర్ జట్టులోకి రావాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News