IPL 2023 QF-1: చెన్నై-గుజరాత్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు, కారణాలివే

IPL 2023 QF-1: ఐపీఎల్ 2023 క్వాలిఫర్-1 మ్యాచ్‌పై ఇప్పుడు వివాదం ప్రారంభమైంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నెటిజన్లు ఈ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2023, 10:07 AM IST
IPL 2023 QF-1: చెన్నై-గుజరాత్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు, కారణాలివే

IPL 2023 QF-1: చెన్నై చేపాక్ స్డేడియం వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ 2023 క్వాలిఫయర్-1 మ్యాచ్ ఫలితంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఫలితం ముందే నిర్ణయమైందనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణ టార్గెట్‌కే గుజరాత్ చేతులెత్తేయడంపై నెటిజన్ల అనుమానాలు వైరల్ అవుతున్నాయి. 

ఐపీఎల్ 2023 చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఫలితం చెన్నై అభిమానులకు పండగగా ఉంటే గుజరాత్ మద్దతుదారులకు జీర్ణించుకోలేనిదిగా ఉంది. చెన్నై చేపాక్ స్డేడియంలో నిన్న జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టును 15 పరుగుల తేడాతో ఓడించింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్ టైటాన్స్ చతికిలపడటంపైనే నెటిజన్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గుజరాత్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ మ్యాచ్ ఓడిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని నెటిజన్లు నేరుగానే ఆరోపిస్తున్నారు. ఇందుకు నెటిజన్లు చెబుతున్న కారణాలు కూడా ఆసక్తి కల్గిస్తున్నాయి. 

ఫిక్సింగ్ ఆరోపణలకు నెటిజన్ల కారణాలు

మూడుసార్లు ఓడించిన జట్టు చేతిలో కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓడిపోవడం నెటిజన్లకు అనుమానం రేకెత్తిస్తోంది. కష్టసాధ్యం కాని లక్ష్యఛేధనలో బ్యాటర్లు విఫలం కావడం, అంపైరింగ్ సరిగ్గా లేకపోయినా కెప్టెన్ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిర్లక్ష్య పూరితమైన షాట్లతో వికెట్లు పోగొట్టుకున్న తెవాతియా, మిల్లర్ వైఖరి, ఫీల్డర్ ఉన్నాడని తెలిసి కూడా నిర్లక్ష్యమైన షాట్‌తో క్యాచ్ ఇచ్చి అవుటైన కెప్టెన్ హార్డిక్ పాండ్యా వ్యవహారం ఫిక్సింగ్ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. 

అనుమానాస్పదంగా ఉన్న విజయ్ శంకర్ క్యాచ్‌పై పరిశీలన లేకుండానే థర్డ్ ఎంపైర్ అవుట్ ప్రకటించడం సందేహాలు లేవనెత్తుతోంది. సీఎస్కే బౌలర్ పతిరణ విషయంలో అంపైర్లు ధోనీకి తలొగ్గారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేనివిధంగా గుజరాత్ టైటాన్స్ ఆలవుట్ కావడాన్ని నెటిజన్లు సహించలేకపోతున్నారు. 

గుజరాత్ టైటాన్స్ జట్టులో శుభమన్ గిల్, రషీద్ ఖాన్ మినహా మరెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోవడం కూడా నెటిజన్లలో అనుమానాలు కల్గిస్తోంది. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఫలితమని విమర్శిస్తున్నారు. కచ్చితంగా ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. 

Also read: IPL 2023 Updates: క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం, ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్‌కింగ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News