TS Inter second year results 2021: హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వెల్లడించే విధానానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఫస్ట్ ఇయర్లో వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్లో ఆయా సబ్జెక్టులకు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
తెలంగాణలో మంగళవారం కొత్తగా మరో 51 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనివి 37 కాగా వలసకూలీలు 14 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ బారినపడిన వారి సంఖ్య మొత్తం 1,326కి చేరుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. విజయనగరం జిల్లా ( Vizianagaram district ) బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డయాలసిస్ ( Dialysis VIMS ) చికిత్స తీసుకుంటున్నారు.
తెలంగాణలో నేడు కొత్తగా మరో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132 కి చేరింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.
లాక్ డౌన్ నిబంధనలు కొంత సడలించినప్పటికీ.. బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడం స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సొంత వాహన సదుపాయం లేనివాళ్లకు బస్సు సర్వీసులే ఆధారం కావడంతో బస్సులు మళ్లీ ఎప్పుడూ రోడ్డెక్కుతాయా అని ఎదురుచూస్తున్న వాళ్లే అధికం.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఏపీలో గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి (Grama volunteer posts recruitment) ఏపీ సర్కార్ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ నెల 20 నుంచి 24 వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా 25వ తేదీన దరఖాస్తులను పరిశీలించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.