హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా మరో 51 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనివి 37 కాగా వలసకూలీలు 14 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ బారినపడిన వారి సంఖ్య మొత్తం 1,326కి చేరుకుంది. కరోనావైరస్ కారణంగా ఇవాళ మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 32కి చేరింది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇవాళ 21 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 822 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also read : మంత్రి కేటీఆర్‌కి జలుబు.. స్పందించిన మంత్రి
కరోనావైరస్ కారణంగా ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇద్దరు చనిపోయారు. మృతులలో ఒకరు మూసబౌలికి చెందిన 61 ఏళ్ల వృద్ధుడు కాగా మరొకరు జియాగూడకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు.
వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వలస కూలీల ఆరోగ్య పరిస్థితిన పరీక్షించడానికి రాష్ట్ర సరిహద్దులలో 87 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 1000 మందికిపైగా ఆరోగ్య శాఖ సిబ్బందితో 275 బృందాలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..