బస్సుల కోసం వెయిటింగా ? ఇదిగో గుడ్ న్యూస్

లాక్ డౌన్ నిబంధనలు కొంత సడలించినప్పటికీ.. బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడం స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సొంత వాహన సదుపాయం లేనివాళ్లకు బస్సు సర్వీసులే ఆధారం కావడంతో బస్సులు మళ్లీ ఎప్పుడూ రోడ్డెక్కుతాయా అని ఎదురుచూస్తున్న వాళ్లే అధికం.

Last Updated : May 6, 2020, 09:10 PM IST
బస్సుల కోసం వెయిటింగా ? ఇదిగో గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నివారణ కోసం లాక్‌డౌన్‌ విధించిన అనంతరం బస్సులు రోడ్డెక్కలేదు. అప్పటి నుంచి స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న వాళ్లంతా బస్సు సర్వీసులు అందుబాటులో లేక ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు కొంత సడలించినప్పటికీ.. బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడం స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సొంత వాహన సదుపాయం లేనివాళ్లకు బస్సు సర్వీసులే ఆధారం కావడంతో బస్సులు మళ్లీ ఎప్పుడూ రోడ్డెక్కుతాయా అని ఎదురుచూస్తున్న వాళ్లే అధికం. అంతేకాకుండా తప్పనిసరి అవసరాలపై ప్రయాణాలు చేయాల్సిన వాళ్లు కూడా ఉండనే ఉంటారు. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే కేంద్రం ఓ తీపి కబురు అందించింది. పరిస్థితిలో కొంత మార్పు వచ్చిన అనంతరం త్వరలోనే పలు షరతులతో ప్రజా రవాణాను అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 

Also read : పెట్రోల్, డీజిల్, మద్యంపై భారీగా కరోనా టాక్స్

బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత బస్, కార్‌ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం కేంద్ర మంత్రి చర్చించారు. సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినకుండా ఒక స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం ప్రజా రవాణా సేవలను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టంచేశారు. చాలామంది చాలా చోట్ల చిక్కుకుపోయారని.. వాళ్ల కోసమైనా ఏదో ఓ దశలో రోడ్డు, రైల్వే, విమాన సేవలు ప్రారంభించాల్సిన అవసరమైతే ఉందని మంత్రి నితిన్ గడ్కరి అభిప్రాయపడ్డారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News