Free Electricity and RS 500 Gas Cylinder: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 27 లేదా 29వ తేదీల్లో గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
CM Revanth Reddy Review Meeting: సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు గ్యారంటీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వీటిలో రెండు హామీలకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ఆదేశించారు.
Farmers Loans Waiver: రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఇప్పటికే రైతు బీమా, రైతు బంధు పథకంతో పాటు రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోన్న తెలంగాణ సర్కారు తాజాగా రూ. 99,999 లోపు రుణాలు ఉన్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు విడుదల కాగా ఇక రైతుల రుణ ఖాతాల్లో జమ కావడమే మిగిలి ఉంది.
Farmers Loan Waiver: కరోనా సమయంలోనూ రైతుల కోసం తమ సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించారని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
Telangana Electricity: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 7 గంటలకు కుదించినట్లు గురువారం ఓ ప్రకటన వచ్చింది. ఇప్పటి వరకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం ఇలా సరఫరాను కుదించడం పట్ల రైతాంగం ఆందోళన చెందింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేతపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.