దళిత బంధు పథకం కోసం లక్ష కోట్లయినా వెనక్కి తగ్గం: హాలియా సభలో సీఎం కేసీఆర్

CM KCR speech in Halia meeting: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ముందు హాలియాలో అధికార పార్టీ టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ అక్కడ వారికి పలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ హామీల సమీక్షలో భాగంగానే నేడు హాలియా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ (KCR Halia tour).. హాలియా మునిసిపాలిటీ, నందికొండ మున్సిపాల్టీలకు వరాల జల్లు కురిపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2021, 07:01 PM IST
దళిత బంధు పథకం కోసం లక్ష కోట్లయినా వెనక్కి తగ్గం: హాలియా సభలో సీఎం కేసీఆర్

CM KCR speech in Halia meeting: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ముందు హాలియాలో అధికార పార్టీ టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ అక్కడ వారికి పలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ హామీల సమీక్షలో భాగంగానే నేడు హాలియా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ (KCR Halia tour).. హాలియా మునిసిపాలిటీ, నందికొండ మున్సిపాల్టీలకు వరాల జల్లు కురిపించారు. హాలియా, నందికొండ మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనుల నిమిత్తం మొత్తం 150 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

హాలియాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR in Halia) తెలిపారు. హాలియాలో డిగ్రీ కాలేజీతో పాటు మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. అలాగే, గుర్రంపోడు లిఫ్ట్‌ ఇరిగేషన్ పనులకు సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. 

Also read : దళిత బంధు పథకంపై తెలంగాణ హైకోర్టు ఛీప్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా దళిత బంధు పథకం గురించి సీఎం కేసీఆర్ (CM KCR about Dalita Bandhu Scheme) మాట్లాడుతూ.. ఈ పథకంపై గిట్టనివారు జనంలో ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత బంధు పథకం దళితుల అభివృద్ధి కోసం తీసుకొస్తున్న ఒక అద్భుతమైన పథకం అని అభిప్రాయపడ్డారు. దళిత బంధు పథకం (Dalit bandhu scheme) అమలు కోసం అవసరమైతే లక్ష కోట్లు వెచ్చించడానికైనా వెనుకాడబోమని మరోసారి స్పష్టంచేశారు. అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందిస్తామని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

Also read : ఈటల రాజేందర్ మోకాలికి శస్త్రచికిత్స.. పాదయాత్రపై సస్పెన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News