పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. టీఆర్ఎస్‌లో చేరిన పెద్ది రెడ్డి

Peddi Reddy joins TRS ahead of Huzurabad bypolls: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకంటే ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్‌కి చెందిన బీజేపీ నేత పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై (Etala Rajender) బీజేపి అభ్యర్థిగా పోటీ చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2021, 06:45 PM IST
పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. టీఆర్ఎస్‌లో చేరిన పెద్ది రెడ్డి

Peddi Reddy joins TRS ahead of Huzurabad bypolls: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకంటే ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్‌కి చెందిన బీజేపీ నేత పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై (Etala Rajender) బీజేపి అభ్యర్థిగా పోటీ చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ ని పిలిచి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆయనకు బీజేపి టికెట్ పై పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీజేపిపై పెద్దిరెడ్డి మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు. 

బీజేపీపై అసంతృప్తితోనే ఆ పార్టీని వీడిన పెద్ది రెడ్డి ఇవాళ సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో తెలంగాణ భవన్ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దిరెడ్డికి సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దిరెడ్డితో పాటు హుజూరాబాద్‌కే చెందిన కాంగ్రెస్‌ నేత స్వర్గం రవి కూడా టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎల్.రమణ, బాల్క సుమన్ హాజరయ్యారు. 

Also read : దళిత బంధును వ్యతిరేకిస్తే సహించం: ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితుడు అని అన్నారు. ఒకానొక సమయంలో తాము ఇద్దరం మంత్రులుగా కలిసి పనిచేశాం అని పెద్దిరెడ్డితో (PeddiReddy) తనకు ఉన్న అనుబంధం గురించి కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. వ్యవసాయ శాఖలో రైతు బంధు పథకం (Rythu bandhu scheme) పక్కాగా అమలవుతోందని.. అలాగే చేనేత కార్మికుల కోసం రైతు బీమా తరహాలోనే ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా (Rythu beema) తరహా పథకం తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చాలా ఇబ్బందులు ఉండేవని.. ఆ సమస్యలను అధిగమిస్తూ వచ్చామని సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు.

Also read : దళిత బంధు పథకంపై, సీఎం కేసీఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News