Dalita bandhu scheme: దళిత బంధు పథకంపై Kadiyam Srihari సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari comments on Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ పార్టీ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకంను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే ముందుగా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీనే అని కడియం శ్రీహరి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2021, 12:13 AM IST
Dalita bandhu scheme: దళిత బంధు పథకంపై Kadiyam Srihari సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari comments on Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ పార్టీ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకంను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే ముందుగా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీనే అని కడియం శ్రీహరి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. టీఆర్ఎస్ పార్టీ దళిత బంధు అనే సింహంపై సవారీ చేస్తోంది అని.. ఆ సింహంపై నుంచి దిగితే అది మింగేస్తుందని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసమే ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే 

దళిత బంధు పథకంపై (Dalita bandhu scheme) ఇప్పటికే బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనియాంశమయ్యాయి. కడియం శ్రీహరి చేసిన పరోక్ష వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందిపెట్టేవిలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దళిత బంధుపై పెదవి విరుస్తున్న వారి సంఖ్య ఇప్పటివరకు అధికార పార్టీ బయటే ఉండగా.. తాజాగా అధికార పార్టీలోనూ మొదలైందనే వాదన వినిపిస్తోంది. 

కొత్తగా టీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులైన దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) లాంటి వాళ్లు దళిత బంధు పథకంను నెత్తికెత్తుకుంటుంటే.. అదే సామాజిక వర్గానికి చెందిన దళిత నాయకుడైన కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనే వాళ్లు కూడా లేకపోలేదు.

Trending News