Mumbai Mayor, Family Get Death Threat: ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ బెదిరింపులు వచ్చాయి. గతేడాది కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఓ అజ్ఞాతవాసి ఆమె ఫోన్ చేసి గతేడాది డిసెంబర్లో బెదిరించాడు.
అయితే ఈసారి కిశోరికి ఒక లెటర్ వచ్చింది.
Husband kills wife in moosapet Hyderabad : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించాడు. హైదరాబాద్‌లోని మూసాపేటలో ఈ దారుణం జరిగింది. శిరీష, సంతోశ్లు ఇద్దరూ మూసాపేటలోనే నివాసం ఉండేవారు. పెళ్లి కొన్ని రోజులకే శిరీషపై సంతోష్‌కు అనుమానం పెరిగింది. ఈ క్రమంలో శిరీషను హత్య చేశాడు.
Faisalabad Incident Video: పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ లో కొందరు మహిళలను వివస్త్రలను చేసి దాడి చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమను వివస్త్రలను చేసి కొందరు దాడి చేశారని నలుగురు మహిళలు ఆరోపించగా.. తన దుకాణంలోకి చోరీకి వచ్చిన కారణంగా ఆ మహిళలపై దాడి చేసినట్లు షాప్ యజమాని చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకుందాం.
Girls Molested in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రిన్సిపల్.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మహిళా కమిషన్.. వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది.
Nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారులో ఉన్న శ్రీరాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
Road Accident: ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
Shilpa Chowdary’s investment scam update : శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు ఇవాళ కూడా ప్రశ్నించారు. పలువురి నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. అయితే తన వద్ద రాధిక అనే మహిళ డబ్బులు తీసుకుందని శిల్ప చెప్పినట్టు తెలుస్తోంది.
Father kills 11 months old daughter : భార్యతో గొడవపడి అభం శుభం తెలియని చిన్నారిని హత మార్చాడు ఆ భర్త. చిన్నారికి విద్యుత్ షాక్ పెట్టి.. చిత్ర హింసలకు గురి చేశాడు ఆ దుర్మార్గుడు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఈ దారుణం జరిగింది.
Shilpa Chowdary News: టాలీవుడ్ లో అనేక నటీనటులను మోసం చేసిన శిల్పా చౌదరిపై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు నమోదైంది. యంగ్ హీరో హర్ష శిల్పపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన దగ్గర రూ.3 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించడం లేదని హర్ష పోలీసులు ఫిర్యాదు చేశారు.
Family of four suicide in sangareddy : బిజినెస్‌లో లాస్ రావడంతో భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడ్డాయి. దీంతో భర్త ఇంట్లో ఉరేసుకున్నారు. భార్య తన ఇద్దరు పిల్లలతో కలసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Kerala CPM activist among a dozen accused of circulating nude video : మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి... లైంగికంగా వేధించారు. తర్వాత ఆమె నగ్న వీడియోలను రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, సర్క్యులేట్ చేస్తున్నాడనే ఆరోపణతో సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడు ఎలిమన్నిల్ సజిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Chaddi gang in Vijayawada: గుంటుపల్లిలోని ఒక అపార్ట్మెంట్లోకి చెడ్డీగ్యాంగ్‌కి చెందిన ఒక ఐదుగురు సభ్యుల ముఠా చొరబడింది. ఇది అంతా అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల దోపిడీలకు పాల్పడ్డ చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన ముఠానే తాజాగా గుంటుపల్లిలో చోరీకి ప్రయత్నించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Mother along with 9 months old child suicide : మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన వివాహిత సరిత రెండు రోజుల క్రితం తన కూతురును తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎంతకూ తిరిగిరాలేదు. సరిత తన నడుముకు కట్టుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యం స్థానికులందరినీ కలచివేసింది.
Leopard Strays Into School: ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ జిల్లాలో భయంకరమైన సంఘటన జరిగింది. చౌదరి నిహాల్ సింగ్ పాఠశాలలో చిరుత పులి ప్రవేశించింది. పదో తరగతి గదిలోకి ప్రవేశించిన ఆ చిరుత పులి లక్కీ రాజ్ సింగ్ అనే బాలుడిపై దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.