Hyderabad: హైదరాబాద్ లో దారుణం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు..

Hyderabad: ఓ మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా..ఇంటి యజమాని కొడుకు వీడియో తీసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 07:59 PM IST
Hyderabad: హైదరాబాద్ లో దారుణం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు..

Hyderabad: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఓ మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా..ఇంటి ఓనర్ కొడుకు వీడియో తీసిన ఘటన హైదరాబాద్ ఫిలింనగర్(Film Nagar)లో చోటుచేసుకుంది. ఈమేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 3 నెలలుగా ఇంటి యజమాని కుమారుడు ..తాను  స్నానం చేస్తుండగా వీడియోలు(Video) తీశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు కూడా అతనికే మద్దతు పలుకుతున్నారని ఆమె వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: Video: హైదరాబాద్ లో దారుణం.. తలపై నుండి వెళ్లిన లారీ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

బాత్రూమ్‌లో ఉన్న మహిళను సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీస్తున్న ఇంటర్నెట్‌ టెక్నీషియన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులు అప్పగించిన ఘటన ఇటీవలె బంజారాహిల్స్(Banjarahills)లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటే ఉదంతం చోటుచేసుకోవడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News