Cylinder Blast: బీహార్‌లో తీవ్ర విషాదం.. సిలిండర్ పేలి ఒకే కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు దుర్మరణం..

Bihar Gas Cylinder Blast: బిహార్​లో ఘోర ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు దుర్మరణం చెందారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 08:02 AM IST
  • బీహార్‌లో ఘోర ప్రమాదం
  • సిలిండర్ పేలి ఐదుగురు చిన్నారులు మృతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Cylinder Blast: బీహార్‌లో తీవ్ర విషాదం.. సిలిండర్ పేలి ఒకే కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు దుర్మరణం..

Bihar Gas Cylinder Blast: బీహార్‌లోని బంకాలో (Banka) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటన రాజావర్ గ్రామంలో (Rajawar village) జరిగింది. 

ఏం జరిగిందంటే...
బంకా బ్లాక్ ఏరియాలోని రాజావర్ గ్రామంలో ప్రకాశ్ పాసవాన్​ తన భార్య సీతా దేవి, నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. మంగళవారం సునీతాదేవి వంట చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించగానే మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన సునీత భర్తను పిలవడానికి బయటికి పరుగులు తీసింది. కిచెన్​లో గ్యాస్​కు సమీపంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతలో సిలిండర్ పేలడంతో (Cylinder Blast) పిల్లలు అంకుశ్ కుమార్​(12), అన్షు కుమారీ(8), సీమా కుమారీ(4), శివాని కుమారీ(6) కాలిబూడిదయ్యారు. సీత మాత్రం గాయాలతో బయటపడగలిగింది. మృతి చెందిన చిన్నారుల్లో ప్రకాశ్ పాసవాన్ తమ్ముడు చోటు కుమార్తె సోనీ కుమారీ(3) కూడా ఉంది.

Also Read: Omicron Variant: వేగం పుంజుకున్న ఒమిక్రాన్, ఆందోళన రేపుతున్న సెకండరీ కాంటాక్ట్ సంక్రమణ

ప్రమాదం జరిగిన సమయంలో ప్రకాష్‌కు చెందిన ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంటి బయట ఉండడంతో వారిద్దరి ప్రాణాలు దక్కాయి. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. సంఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారి మొయినుద్దీన్ తెలిపారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x