Covid19 vaccine: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కంటే వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీ అంతకుమించిన సవాలుగా మారింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు ప్రీ బుకింగ్ చేసుకున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి..
Covid19 vaccination: కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ పంపిణీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులో రానుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. హైదరాబాద్‌లో ఎవరికి ముందుగా వ్యాక్సిన్ వేయనున్నారంటే..
అగ్రరాజ్యం అమెరికా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వణికిపోతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. గురువారం ఒక్కరోజులోనే...3 వేలకు పైగా మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.
Oxford vaccine in india : ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది..ఇప్పుడిదే ప్రశ్న రేగుతోంది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అనుమతి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇండియా ఎప్పుడు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదిస్తుందో తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేందుకు కొద్దిరోజులే మిగిలింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులో రానుందని తెలుస్తోంది.
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురిస్తున్న నేపధ్యంలో..ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భూ మండలంపై ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో వరుసగా శుభవార్తలు విన్పిస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ ప్రకటన రేపిన ఉత్సాహం మరువక ముందే ఇప్పుడు మోడెర్నా మరో శుభవార్త విన్పించింది. 94 శాతం ప్రభావవంతంగా ఉందని మోడెర్నా కంపెనీ వెల్లడించింది.
కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే భారతదేశంలో అందుబాటులో రానుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ మేరకు ఓ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నాటికి 10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఆడలేక మద్దెలదరువన్నాడట వెనకటికి ఓ వ్యక్తి. డోనాల్డ్ ట్రంప్‌ను చూస్తుంటే అదే గుర్తొస్తుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఫైజర్ కంపెనీ చేసిన ప్రకటన డోనాల్డ్ ట్రంప్‌లోని ఓటమి అసహనాన్ని పెంచేసింది. తన విజయాన్ని అడ్డుకునేందుకే ఫైజర్, బయోన్టెక్ కంపెనీలు కుట్ర చేశాయని ఆరోపిస్తున్నారు.
కరోనా వైరస్ కట్టడి కోసం నిరంతరం ప్రపంచంలో ఏదో మూల పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 30 సెకన్ల పాటు అలా చేస్తే..కరోనా ప్రభావం తగ్గుతుందని అంటున్నారు.
రష్యా, చైనా దేశాలు కరోనా వ్యాక్సిన్ సిద్ధమని ప్రకటించినా..ప్రపంచంలోని అత్యధిక దేశాల దృష్టి మాత్రం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉన్న టీకాను డిసెంబర్లో అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కరోనా వ్యాక్సిన్ ముందుగా ఎవరికి..ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఎవరికి వారు తమకే ముందుగా అందాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ వైఖరే ప్రమాదకరమంటోంది డబ్ల్యూహెచ్ వో. ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వైరస్ కట్టడి ఉంటుందంటోంది.
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులో రానుంది. మరి ముందుగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ బెనిఫిషియరీ సిస్టమ్ రూపొందించనుంది.
భారత్ బయోటెక్ (Bharat Biotech) ఇంటర్నేషనల్ కోవాగ్జిన్ ( Covaxin) పేరుతో కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవాగ్జిన్ మూడో దశ క్లినికిల్ ట్రయల్స్ నవంబర్ నెలలో చేయనున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ (Union Health Minister Harsh Vardhan) చెప్పారు.
ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. టీకాను పరిశీలించకుండా ముందస్తు అనుమతి తీసుకోమని ఏకంగా 9 ఫార్మా కంపెనీలు నిర్ణయించుకున్నాయి.
కోవిడ్19 వ్యాక్సిన్ అందిస్తుందని భావిస్తోన్న ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా (Astra Zeneca Vaccine), ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి అంతా సిద్ధంగా ఉండాలని అక్టోబర్ చివరికల్లా పనులు పూర్తి చేయాలని అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, ఉన్నతాధికారులకు సీడీసీ లేఖ రాసింది. నవంబర్ 1 నుంచి అమెరికా కరోనా టీకా పంపిణీ (US Corona Vaccine) చేయనున్నట్లు తెలుస్తోంది.
కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నాయి. అందరి దృష్టి మాత్రం ఒక్క ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి వ్యాక్సిన్ కోసం అమెరికా మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను కనుగొన్న నేపధ్యంలో..అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మోడెర్నా కంపెనీ ( Moderna company ) తో భారీ ఒప్పందమే కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ 150 కోట్ల డాలర్లు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.