America: డిసెంబర్ 11, 12 తేదీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ?

ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేందుకు కొద్దిరోజులే మిగిలింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులో రానుందని తెలుస్తోంది.

Last Updated : Nov 23, 2020, 02:38 PM IST
  • వ్యాక్సిన్ అనుమతి కోసం ఎఫ్ డీ ఏ కు దరఖాస్తు చేసుకున్న ఫైజర్-బయోన్టెక్ కంపెనీలు
  • డిసెంబర్ 11, 12 తేదీల్లో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు
  • కరోనా వ్యాక్సిన్ ముందుగా పొందేది అమెరికన్లే
America: డిసెంబర్ 11, 12 తేదీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ?

ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేందుకు కొద్దిరోజులే మిగిలింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులో రానుందని తెలుస్తోంది.

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ ( Pfizer Company ) ఇప్పుడు అందరికంటే ముందంజలో ఉంది. వ్యాక్సిన్ 95 శాతం ఫలితాల్ని చూపిస్తోందంటూ ప్రకటించి ఆశలు రెేకెత్తించిన ఫైజర్-బయోన్టెక్ సంస్థలు ఇప్పుడు విడుదల తేదీపై దృష్టి సారించాయి. ముందుగా చెప్పినట్టే డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తున్న ఆపరేషన్ వార్ఫ్ స్పీడ్ అధిపతి డాక్టర్ మోన్సెఫ్ స్లౌయి.. డిసెంబర్ 11, 12 తేదీల్లో వ్యాక్సిన్ అందుబాటు లో వస్తుందని అంచనా వేస్తున్నారు. అనుమతి కోసం ఇప్పటికే ఫైజర్-బయోన్టెక్ కంపెనీలు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA ) కు దరఖాస్తు చేసుకున్నాయి. డిసెంబర్ 10 వ తేదీన ఎఫ్ డీ ఏ కీలక సమావేశం జరగనుంది. అనుమతి లభిస్తే..24 గంటల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసి..డిసెంబర్ 11, 12 తేదీల్లో వ్యాక్సినేషన్ చేసేందుకు  రంగం సిద్ధమవుతోంది. 

అన్నీ అనుకున్నట్టు జరిగితే..అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుతుందని డాక్టర్ మోన్సెఫ్ తెలిపారు. వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక శక్తి ( Immunity system )పెరిగి..మొత్తం జనాభాలో  70 శాతం నిరోధకత వస్తే..హార్డ్ ఇమ్యూనిటీ వస్తుందని చెప్పారు. Also read: Italy: ఇప్పటిది కాదు..రెండు వేల ఏళ్ల నాటి శవాలివి

Trending News