Covid19 Vaccine: ఇండియాలో డిసెంబర్ నాటికి పదికోట్ల వ్యాక్సిన్‌లు

కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే భారతదేశంలో అందుబాటులో రానుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ మేరకు ఓ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నాటికి 10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Last Updated : Nov 14, 2020, 05:40 PM IST
  • చివరి దశలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్
  • డిసెంబర్ నాటికి భారత్ లో పదికోట్ల డోసుల ఉత్పత్తి
  • మొత్తం వందకోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యం
Covid19 Vaccine: ఇండియాలో డిసెంబర్ నాటికి పదికోట్ల వ్యాక్సిన్‌లు

కోవిడ్ వ్యాక్సిన్ ( Covid vaccine ) త్వరలోనే భారతదేశంలో అందుబాటులో రానుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ మేరకు ఓ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నాటికి 10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

డిసెంబర్ నాటికి 10 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ( 10 Crore doses of covid vaccine ) ను భారత్‌లో ఉత్పత్తి చేయనున్నట్టు ఆస్ట్రాజెనెకా ( AstraZeneca ) కంపెనీ వెల్లడించింది.  ఆక్స్‌ఫర్డ్‌ ( Oxford ) యూనివర్సిటీ,  ఆస్ట్రాజెనెకాలు భారత్‌లో సంయుక్తంగా తయారు చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్ ను ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute of india ) ఉత్పత్తి , పంపిణీ చేయనుంది. ప్రస్తుతం ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని  సీరం ఇనిస్టిట్యూట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ అదార్‌ పూనావాలా ( Adar poonawalla ) తెలిపారు. కరోనా వైరస్‌ను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడైతే.. అత్యవసర అనుమతి కింద వంద కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని...ఇవన్నీ భారతదేశం కోసమేనని పూనావాలా చెప్పారు.  కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి 2021లో పూర్తిస్థాయి అనుమతులు లభిస్తే 50-50 శాతం నిష్పత్తితో దక్షిణ ఆసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇప్పటి వరకూ  40 మిలియన్‌ డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు అదార్ పూణావాలా చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా అందరికీ  వ్యాక్సిన్ అందడానికి 2024 వరకు సమయం పట్టవచ్చని చెప్పారు.  కొవిడ్ వ్యాక్సిన్ భారత్‌లో అందరికీ అందించాలంటే  80 వేల కోట్లు అవసరమౌతాయని సెప్టెంబర్ నెలలోనే భారత ప్రభుత్వానికి అదార్ పూణావాలా తెలిపారు.  Also read: Earthquake: మిజోరంలో భారీ భూకంపం

Trending News