Pfizer versus Trump: వ్యాక్సిన్ ప్రకటనపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

ఆడలేక మద్దెలదరువన్నాడట వెనకటికి ఓ వ్యక్తి. డోనాల్డ్ ట్రంప్‌ను చూస్తుంటే అదే గుర్తొస్తుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఫైజర్ కంపెనీ చేసిన ప్రకటన డోనాల్డ్ ట్రంప్‌లోని ఓటమి అసహనాన్ని పెంచేసింది. తన విజయాన్ని అడ్డుకునేందుకే ఫైజర్, బయోన్టెక్ కంపెనీలు కుట్ర చేశాయని ఆరోపిస్తున్నారు.

Last Updated : Nov 10, 2020, 02:11 PM IST
Pfizer versus Trump: వ్యాక్సిన్ ప్రకటనపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

ఆడలేక మద్దెలదరువన్నాడట వెనకటికి ఓ వ్యక్తి. డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ‌ను చూస్తుంటే అదే గుర్తొస్తుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఫైజర్ కంపెనీ చేసిన ప్రకటన డోనాల్డ్ ట్రంప్‌లోని ఓటమి అసహనాన్ని పెంచేసింది. తన విజయాన్ని అడ్డుకునేందుకే ఫైజర్, బయోన్టెక్ కంపెనీలు కుట్ర చేశాయని ఆరోపిస్తున్నారు.

అమెరికాలోని దిగ్గజ ఫార్మా కంపెనీ ఫైజర్ ( Pfizer )..కోవిడ్ వ్యాక్సిన్‌ ( Covid19 vaccine )పై చేసిన ప్రకటన సంచలనంగా మారింది. షేర్ మార్కెట్‌ను ఎగిసేలా చేసిన ఈ ప్రకటన డోనాల్డ్ ట్రంప్‌లో మాత్రం అసహనాన్ని మరింతగా పెంచేసింది. వ్యాక్సిన్ సమర్ధవంతందా పనిచేస్తుందనే విషయాన్ని పైజర్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA ) సంస్థలు కావాలనే దాచిపెట్టాయని ట్రంప్ మండిపడ్డారు. తన విజయాన్ని అడ్డుకునేందుకే ఈ రెండు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రకటనను కొద్దికాలం పాటు నిలిపివేశాయన్నారు. సరిగ్గా  ఎన్నికల ఫలితాలు వెలువడిన 5 రోజుల అనంతరం ప్రకటన విడుదల చేయడం దీనికి నిదర్శనమన్నారు. 

ఒక వేళ జో బిడెన్ ( Joe Biden )‌ అధ్యక్షుడిగా ఉంటే వ్యాక్సిన్‌ వచ్చి ఉండేది కాదని, ఎఫ్‌డిఎ సైతం ఇంత త్వరగా ఆమోదించి ఉండేది కాదన్నారు. ఫలితంగా లక్షలాది ప్రాణాలు పోయేవని ట్రంప్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్‌పై ఎఫ్‌డిఎ ముందే ప్రకటన చేసి ఉండాల్సిందంటూ ట్రం‍ప్‌ ట్వీట్‌ చేశారు. 

మరోవైపు వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధించినందుకు కొత్త అధ్యక్షుడు జో బిడెన్ శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీలో సహకరించిన వారందరినీ అభినందిస్తున్నానని చెెప్పారు. కోవిడ్‌పై తుది సమరానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉందన్నారు. వ్యాక్సిన్ త్వరలోనే అందరికీ అందుతుందన్నారు. జర్మనీ కంపెనీ బయోన్టెక్‌ ( Biontech ) తో కలిసి ఫైజర్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.  ఎలాంటి వైరస్ లక్షణాలు లేని ట్రయల్ వాలంటీర్లలో వ్యాధిని నివారించడంలో 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా రుజువైందని తాజా విశ్లేషణలో తేలిందని ఫైజర్ తెలిపింది Also read: Hyperloop : హైపర్ లూప్ పాసెంజర్ టైన్ తొలి ప్రయోగం సక్సెస్, ముంబై-పూణేపై దృష్టి

Trending News