Covid19 vaccine: కరోనా వ్యాక్సిన్‌ను ఏ దేశం ఎన్నెన్ని బుక్ చేసుకుందంటే

Covid19 vaccine: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కంటే వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీ అంతకుమించిన సవాలుగా మారింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం  చాలా దేశాలు ప్రీ బుకింగ్ చేసుకున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి..

Last Updated : Dec 16, 2020, 05:09 PM IST
  • నవంబర్ నాటికే 7.48 మిలియన్ డోసుల వ్యాక్సిన్ బుక్ చేసుకున్న వివిధ దేశాలు
  • 2021 సంవత్సరాంతానికి 5.91 బిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తికి అవకాశం
  • కెనడా అత్యధికంగా ఒక్కొక్కరికి నాలుగు డోసుల చొప్పున బుక్ చేసుకున్న పరిస్థితి
Covid19 vaccine: కరోనా వ్యాక్సిన్‌ను ఏ దేశం ఎన్నెన్ని బుక్ చేసుకుందంటే

Covid19 vaccine: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కంటే వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీ అంతకుమించిన సవాలుగా మారింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం  చాలా దేశాలు ప్రీ బుకింగ్ చేసుకున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి..

ఒక్కొక్క కరోనా వ్యాక్సిన్ ( corona vaccine ) చేతికందే సమయం వచ్చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేస్తోంది. మరి పేద దేశాల్లో మాత్రం ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీనికి కారణం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా ధనిక దేశాలు వ్యాక్సిన్‌ను బుక్ చేసుకుని ఉన్నాయి.

బీఎంజే మెడికల్ జర్నల్ ( Bmj medical journal ) అందిస్తున్న వివరాల ప్రకారం నవంబర్ నాటికే ప్రపంచవ్యాప్తంగా 7.48 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను వివిధ దేశాలు బుక్ చేసుకున్నాయి. 2021 సంవత్సరాాంతానికి 5.91 బిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి కానుంది. 40 శాతం కరోనా వ్యాక్సిన్ డోసులు పేద, మధ్య తరగతి దేశాలకు అందుబాటులే ఉండే విషయంపై ఇంకా స్పష్టత లేదు. వ్యాక్సిన్ పంపిణీ ( Vaccine Distribution ) విషయంలో పారదర్శకత ఉంటేనే సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రజలకు అందుతుందని బీఎంజే మెడికల్ జర్నల్ స్టడీ చెబుతోంది. 

వ్యాక్సిన్ కనీస ధర 6 నుంచి 7 డాలర్ల వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే దనిక దేశాలన్నీ వ్యాక్సిన్‌ను బుక్ చేసుకున్నాయి. కెనడా ( Canada ) దేశంలోని ప్రతి ఒక్కరికి నాలుగు కరోనా వ్యాక్సిన్‌ల చొప్పున బుక్ చేసుకోగా..అమెరికా ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క డోసు చొప్పున బుక్ చేసుకున్నాయి. ఇండోనేషియా వంటి దేశాలు ప్రతి ఇద్దరికి ఒక్కొక్కటి చొప్పున బుక్ చేసుకున్నాయి. Also read: Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Trending News