COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 57,416 కరోనా పరీక్షలు చేయగా 4,305 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Delhi AIIMS doctors tested positive: న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనావైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే ఘటన ఇది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది డాక్టర్లు కరోనావైరస్ బారినపడ్డారు. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రుల్లో రెండోది అయిన ఎయిమ్స్‌లో 35 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు కరోనాపై పోరులో పాల్గొంటున్న వైద్య సిబ్బందిని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి.
22 Members of a family tested positive for COVID-19 | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనావైరస్ సోకడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో తమ బంధువు మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు హాజరై వచ్చిన అనంతరం వారికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు గుర్తించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ సోమవారం ఉదయం 9 గంటల మధ్య 43,127 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 6,051 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Hyderabad collector Sweta mohanty: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం వెలుగుచూస్తున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులలో హైదరాబాద్ నగరంలోనే ( Hyderabad ) అధిక సంఖ్యలో కేసులు ఉంటున్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కూడా కరోనావైరస్ సోకిన బాధితుల జాబితాలో చేరారు.
PM Modi speech highlights: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనావైరస్పై గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్-2 దశలోకి ( Unlock 2.0 ) ప్రవేశించామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలైట్స్ ఇలా ఉన్నాయి.
Telangana COVID-19 updates తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాడు కొత్తగా మరో 99 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, మిగితా 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. స్థానికులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 70 కేసులు వెలుగుచూశాయి.
భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరగా ఇప్పటివరకు 886 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,913గా ఉంది. భారత్ లో కరోనా సోకి నయమైన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు సైతం తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారిని అడ్డుకోవడం కోసం.. వారిలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
భారత్‌లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది.
గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం శనివారం తనిఖీ చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్‌లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికిగాను ప్రత్యేకంగా 1,500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ను నియంత్రించడం కోసం ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్ విధించి విధిగా సోషల్ డిస్టన్స్ నిబంధనను పాటిస్తున్నాయి. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే.. ఇంట్లో ఉండే కరోనాను ఎదుర్కోవాలి అనేది జగమెరిగిన సత్యం. అందుకే కరోనా విషయంలో ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ పద్ధతినే ఎంచుకున్నాయి.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 700 మార్కును చేరుకున్నట్టయింది. నేడు రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి 68 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో గత 24 గంటల్లో 826 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరినట్టయింది. మరోవైపు గత 24 గంటల్లో 28 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో బుధవారం కొత్తగా మరో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. కరోనా వైరస్ కారణంగా బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. తెలంగాణలో బుధవారం కొత్తగా నమోదైన 6 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 650కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
లాక్ డౌన్ పొడిగింపు కారణంగా మే 3వ తేదీ వరకు దేశంలో డొమెస్టిక్ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం పౌరవిమానయాన శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 3వ తేదీ వరకు పొడిగించడం వెనుక సరైన కారణాలే ఉన్నాయని.. అందుకే దేశంలో విమానాల రాకపోకలను సైతం నిలిపేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు కేంద్ర
తెలంగాణలో ఏప్రిల్ 13, సోమవారం నాడు రాత్రి 10 గంటల వరకు కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించగా, మరొకరు కరోనాతో మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాత్రి 10 గంటలకు తెలంగాణ సర్కార్ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా సహకరించారు. లాక్ డౌన్ కి సహకరించిన వాళ్లందరికీ తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.