న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 826 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరినట్టయింది. మరోవైపు గత 24 గంటల్లో 28 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 420కి చేరుకుంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
COVID19: Decrease in the rise in cases & death rate, 826 positive cases & 28 deaths in 24 hours; the total number of positive cases 12,759 https://t.co/gPAgYFAOMP
— ANI (@ANI) April 16, 2020
Also read : Mobile app: ఆ మొబైల్ యాప్‌తో తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హెచ్చరిక
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొన్న వివరాల ప్రకారం ప్రస్తుతం ఆస్పత్రులలో 10,824 మంది యాక్టివ్ కేసులు ఉండగా.. మరో 1514 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు, వలస వెళ్లిపోయిన వాళ్లు ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..