న్యూఢిల్లీ: లాక్ డౌన్ పొడిగింపు కారణంగా మే 3వ తేదీ వరకు దేశంలో డొమెస్టిక్ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం పౌరవిమానయాన శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 3వ తేదీ వరకు పొడిగించడం వెనుక సరైన కారణాలే ఉన్నాయని.. అందుకే దేశంలో విమానాల రాకపోకలను సైతం నిలిపేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండి, ప్రయాణాలు చేయలేకపోయిన వారి ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని.. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పౌరులు ఓపికతో సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఓ ట్వీట్ చేశారు. Also read : Crime for liquor: నకిలీ పోలిస్ స్టిక్కర్‌తో కారులో లిక్కర్ తరలింపు.. అరెస్ట్
All domestic and international scheduled Airlines operations shall remain suspended till 11.59 pm of 3rd May 2020.
— MoCA_GoI (@MoCA_GoI) April 14, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియాలో లాక్ డౌన్ కంటే ముందు నుంచే విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో దాదాపు 640 విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఇష్టం లేనప్పటికీ.. వైరస్ నివారణ కోసం విమానాల రాకపోకలను నిలిపేసిన ఎయిర్ లైన్స్ సంస్థలు.. ఆర్థికంగా ఇది తమకు తీవ్ర సంక్షోభం అని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఎయిర్ లైన్స్ సంక్షోభంలో పడిన నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత విమానాల సేవలు తిరిగ ప్రారంభమైనా.. టికెట్స్ ధరలు మాత్రం ఆకాశాన్నంటే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. Also read : Flash: ఒక్క రాష్ట్రంలోనే 2,455 కరోనా పాజిటివ్ కేసులు, 160 మంది మృతి
There were good reasons for the Lockdown to be extended till 3rd May.
We can consider lifting restrictions on both domestic & international flights thereafter.
I understand the problems being faced by people who need to travel & request them to bear with us.
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 14, 2020
ఇదిలావుంటే, లాక్ డౌన్ సమయంలోనూ ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలు, ఎయిర్ అంబులెన్స్ తరహాలో వైద్య సహాయం అందించే విమానాల రాకపోకలకు అంతరాయం ఉండదని సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..