లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేశారని 18 మందిని షూట్ చేశారు

కరోనావైరస్‌ను నియంత్రించడం కోసం ప్రపంచదేశాలన్నీ లాక్‌‌డౌన్ విధించి విధిగా సోషల్ డిస్టన్స్ నిబంధనను పాటిస్తున్నాయి. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే.. ఇంట్లో ఉండే కరోనాను ఎదుర్కోవాలి అనేది జగమెరిగిన సత్యం. అందుకే కరోనా విషయంలో ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ పద్ధతినే ఎంచుకున్నాయి.

Last Updated : Apr 18, 2020, 06:00 PM IST
లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేశారని 18 మందిని షూట్ చేశారు

అబుజా: కరోనావైరస్‌ను నియంత్రించడం కోసం ప్రపంచదేశాలన్నీ లాక్‌‌డౌన్ విధించి విధిగా సోషల్ డిస్టన్స్ నిబంధనను పాటిస్తున్నాయి. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే.. ఇంట్లో ఉండే కరోనాను ఎదుర్కోవాలి అనేది జగమెరిగిన సత్యం. అందుకే కరోనా విషయంలో ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ పద్ధతినే ఎంచుకున్నాయి. కొన్ని దేశాల్లో లాక్ డౌన్ చాలా కఠినంగా అమలవుతోంది. ఎవరైనా లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తే... అక్కడి పోలీసులు వారికి తీవ్రమైన శిక్షలు విధిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోదగిన దేశం నైజీరియా. పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న నైజీరియాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ రూల్స్‌ని బ్రేక్ చేసిన వారికి అక్కడి పోలీసులు కఠినమైన శిక్షలను అమలు చేస్తున్నారు. 

Read Also: తబ్లీగీ జమాత్,రోహింగ్యాలకు లింకేంటి..?

లాక్‌డౌన్‌ రూల్స్ బ్రేక్‌ చేశారని ఇప్పటివరకు 18 మందిని కాల్చి చంపారనేది ఆ దేశంలో పోలీసులపై నమోదైన అభియోగం. నైజీరియాలో శుక్రవారం వరకు 493 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 17 మంది చనిపోయారు. అంటే కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కంటే లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించారనే కారణంగా పోలీసులు కాల్చిచంపిన వారే ఎక్కువన్న మాట. డెమోక్రసినౌ.ఆర్గ్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం లాక్‌డౌన్‌ బ్రేక్‌ చేసిన 18 మందిని అక్కడి పోలీసులు, ఆర్మీ బలగాలు కాల్చి చంపాయని తెలుస్తోంది. ఈ మేరకు నైజీరియా నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ వద్ద ఫిర్యాదులు సైతం వెల్లువెత్తున్నాయి. 100కు పైగా సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టుగా నైజీరియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వద్ద ఫిర్యాదులు దాఖలయ్యాయి. 

Also read : వధూ వరులపై కేసు

ఈ విషయంలో నైజీరియ మానవ హక్కుల సంఘం సైతం పోలీసుల తీరుపై గుర్రుగా ఉన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాలు స్పష్టంచేస్తున్నాయి. నైజీరియాలో 36 రాష్ట్రాలు ఉండగా.. అందులో 24 రాష్ట్రాల్లో కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News