బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
బీహార్ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు.
కరోనా సంక్షోభం, వరదల ప్రభావం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను (bihar assembly elections 2020) వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తోసిపుచ్చింది.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.
బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అదే రాష్ట్రంలోని ఉజియర్పూర్ లోక్ సభ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌తో జీ హిందుస్తాన్ కాసేపు ముచ్చటించి అక్కడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. కేంద్రంపై ప్రస్తుతం బీహార్‌లో ఎటువంటి అభిప్రాయం వినిపిస్తోంది ? బీహార్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి ? బిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండనున్నాయి ? ఎవరెవరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొని ఉందనే అంశాలను మా జీ హిందుస్తాన్ యాంకర్ మాధురి కలాల్ ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.