ప్రత్యేక హోదాపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తనదైనశైలిలో స్పందించారు. నెల్లూరు పర్యటనలో ఉన్న ఆయన కావలిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమన్నారు. విభజన హామీలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని... ఈ అఫిడవిట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసిందన్నారు.
విశాఖలో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ నగరంలోని భూకబ్జాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని విమర్శించారు.
ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని పిచ్చిపిచ్చి వేషాలు వేయకండి..ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని సూచించారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే... చేతులు కట్టుకుని కూర్చోబోమని పవన్ టీడీపీ నేతలకు హెచ్చరించారు.
ఏపీ బీజేపీ నేతలు ఈ రోజు గవర్నర్ నరసింహన్ ను కలిసి చంద్రబాబు పాలనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ..కాబట్టి గవర్నర్ చొరవ చూపి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరారు..
కడప స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన దీక్షపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ సెట్లర్లు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరు..కానీ రమేష్ మాత్రం ఏకంగా 11 రోజులు ఆమరణ దీక్ష చేశారు. గ్రేట్ ..ఆయన దీక్షను ‘గిన్నిస్’ కెక్కించాల్సిందే నంటూ సెటైర్లు సంధించారు. రమేష్ దొంగ దీక్ష వల్ల ప్రజల్లో దీక్షలపై ఉన్న నమ్మకం సడలిపోయిందని విమర్శించారు. సీఎం రమేష్ పై విమర్శలు సంధించిన విష్ణుకుమార్ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం.
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఏపీలో పార్టీ బలోపేతం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు... కాగా అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని సమయాత్తం చేసే పనిలో పడ్డారు. ఎన్నికలు ఎదుర్కొవాలంటే బూత్ స్థాయి కమిటీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఆయన దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 55 శాతం బూత్ స్థాయి కమిటీలు వేయడం పూర్తయినట్లు సమాచారం. ఇక మిగిలిన పని కూడా శరంవేగంగా చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతిలోని ప్రజాదర్బార్ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు.
విజయనగరంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని పవన్ చేసిన ఆరోపణలపై జిల్లాకు చెందిన మంత్రి సుజయకృష్ణ స్పందించారు.తమ జిల్లాలో మైనింగ్, ఇసుక మాఫియాలు ఉన్నాయంటూ పవన్ ఆరోపణలు సత్యదూరమన్యారు. ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదువుతున్న పవన్ .. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుకొని మాట్లాడాలని పవన్ కు మంత్రి సుజయకృష్ణ ఎద్దేవ చేశారు.
హోదా కోసం పవన్ ఏం చేశారు ?
కాంగ్రెస్ తో దోస్తీ కోసం చంద్రబాబు ప్రయ్నతిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి యనమల స్పందించారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ఆహ్వానం మేరకే చంద్రబాబు వెళ్లారన్నారు.. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ పిలిస్తే చంద్రబాబు వెళ్లారనడం సత్యదూరమని యనమల వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో దోస్తీ ఉండబోదని యనమల తేల్చిచెప్పారు.
ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీదే కీలక పాత్ర
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.