బీజేపీకి దమ్ముంటే చంద్రబాబు అవినీతిపై ఎంక్వైరీ వేయాలి - లక్ష్మీపార్వతి

                           

Last Updated : Jun 5, 2018, 05:51 PM IST
బీజేపీకి దమ్ముంటే చంద్రబాబు అవినీతిపై ఎంక్వైరీ వేయాలి - లక్ష్మీపార్వతి

గత నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని  చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. రాజధాని ప్రాంతం రైతుల భూములను లాక్కొని బడా బాబులకు అప్పగించాని విమర్శించారు. చంద్రబాబు దోపిడీపై విచారణ  చేపట్టాల్సిన అవసరముందన్న ఆమె.. ఈ విషయంలో బీజేపీ చొరవ చూపించాలన్నారు.

 బీజేపీ ఆ పనిచేస్తే చంద్రబాబు అక్రమంగా సంపాదించిన సొమ్ము,  బినామీ ఆస్తులు వివరాలు ఇలా అన్ని అక్రమాలు బయటికి వస్తాయన్నారు. చంద్రబాబు  దోపిడిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజాలు బయటికి వస్తాయని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

మొన్నటి వరకు బీజేపీతో దోస్తీ చేసి ఇప్పుడు అదే పార్టీపై ఆయన కారాలూ మిరియాలు నూరుతున్నారని.. బీజేపీ నేతలకు దమ్మంటే చంద్రబాబు  అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు

Trending News