బీజేపీ బీసీ నినాదం.. మోడీ బీసీ జాతి రత్నమన్న కన్నా

                                            

Last Updated : Jun 5, 2018, 05:20 PM IST
బీజేపీ బీసీ నినాదం.. మోడీ బీసీ జాతి రత్నమన్న కన్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్న ఏపీ బీజేపీ చీఫ్ కన్నా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాలన్నీంటినీ వినియోగించుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీల విమర్శలకు ఒక వైపు కౌంటర్ ఇస్తూనే మరో వైపు బీజేపీకి ఓటు బ్యాంకు సృష్టించేందుకు కన్నా తీవ్రంగా ప్రయత్తిస్తున్నారు.

పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలకు కన్నా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. తాజగా మరో అడుగు ముందుకేసి  బీసీ కార్డు పట్టుకున్నారు. బీజేపీని బీసీలతో జతకట్టేందుకు యత్నిస్తున్నారు. ముంగళవారం  హైదరాబాద్ లో ఓబీసీ మోర్చా సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

కన్నా ఏమన్నారంటే.. బీసీ జాతి రత్నం మోదీ అని కొనియాడారు. వెనుకబడిన కులాల నుంచి వచ్చిన మోదీని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. మోడీ గెలుపు కోస బీసీలంతా కలసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు.  ఏ రాజకీయ కుటుంబానికి చెందని వ్యక్తి మోదీ దేశ ప్రధాని అయ్యారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామం శుభసూచకమన్నారు. ఇలా బీసీ వర్గాలను ఆకట్టునేందుకు కన్నా ప్రయత్నించారు.

ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి కూలాల వారు చెరో పార్టీ (టీడీపీ,వైసీపీ) వైపు ఉన్నారని గ్రహించిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా బీసీ ఓటు బ్యాంకు వైపు కన్నేశారని.. అందుకే ఆయన మోడీకి బీసీలతో జతకట్టి లబ్ది పొందాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగు మైనార్టీలు బీజేపీకి దూరంగా ఉంటారు కాబట్టి ఒక మిగిలిన కమ్మ,రెడ్డి కులాల వారు టీడీపీ, వైసీపీ ఉంటారు. దీంతొ బీజేపీ బీసీలపైనే నమ్మకం పెట్టుంది. అందుకే కన్నా నోట బీసీ మాట వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

Trending News