COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం వరకు వరుసగా ఐదు రోజులపాటు 20 వేలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టించినట్టే కనిపించాయి. కానీ ఇంతలోనే శనివారం కొత్తగా గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి 20 వేల మార్కు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది.
Minister Kodali Nani: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వ్యవహారంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆ నలుగురికి కరోనా కంటే భయంకర లక్షణాలున్నాయని దుయ్యబట్టారు.
Oxygen Production: కరోనా మహమ్మారి ఉధృతంగా విజృంభిస్తుండటంతో దేశంలో ఆక్సిజన్, మందులు, బెడ్స్ కొరత తీవ్రంగా మారింది. ఈ తరుణంలో ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్టీల్‌ప్లాంట్, నేవీ అదికారుల సహాయం తీసుకోనున్నారు.
Covid Care in Ap: దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Ys jagan on lockdown: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రల్లో కూడా లాక్‌డౌన్‌పై ఒత్తిడి వస్తున్న నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని బట్టి..
AP Government: కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 40 బెడ్స్ ఆసుపత్రుల్ని కోవిడ్ ఆసుపత్రులుగా మార్చడమే కాకుండా..ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.
Covid Review: కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల లభ్యతపై సమీక్షించింది. ఎక్కడా ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది.
Night curfew in Andhra Pradesh: విజయవాడ: ఏపీలో రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కూడా ఇతర రాష్ట్రాల తరహాలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24వ తేదీ, శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) ప్రకటించారు.
Ap Exams: కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒక్కరోజులో 2 లక్షల 60 వేల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అటు ఏపీలో కూడా అదే పరిస్థితి.
Barrage on Vamsadhara river: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మించబోతోంది. వంశధార నదిపై బ్యారేజ్ నిర్మాణం ద్వారా వేలాది ఎకరాల్ని సాగులోకి తీసుకురావాలని సంకల్పించింది. బ్యారేజ్ నిర్మాణానికి సహకారం కోరుతూ ఒరిస్సా ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు.
Ys jagan review: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిర్ధారిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ఆసుపత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు.
Ramadan Wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ ప్రారంభమైంది. రంజాన్ నెల ప్రారంభం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.
Ugadi Panchangam 2021: ఉగాది నాడు జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. అందుకే ఉాగాది నాడు పంచాంగ శ్రవణం క్రమం తప్పకుండా ఉంటుంది. ఆ స్వామీజీ చెప్పిందాని ప్రకారం కేసీఆర్, వైఎస్ జగన్‌లకు చాలా బాగుంటుంది కానీ ఆ నేతకు మాత్రం కష్టాలేనట. ఇంతకీ ఎవరా నేత..
Ugadi Prayers: తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
Ugadi Happy New Year: తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.
AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి రామచంద్రయ్య..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ హయాంలో జరిగిన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Tirupati Bypoll: పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకున్నారు. వేలాదిగా జనం హాజరయ్యే పరిస్థితిని తప్పించేందుకే సభ రద్దు చేసుకున్నట్టు జగన్ స్పష్టం చేశారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ మేజర్ ఎన్కౌంటర్ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.