Corona Second Wave: ఏపీలో దడ పుట్టిస్తోన్న కరోనా వైరస్, రోజుకు 6 వేలు దాటుతోన్న కేసులు

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒక్కరోజులో 2 లక్షల 60 వేల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అటు ఏపీలో కూడా అదే పరిస్థితి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2021, 12:25 PM IST
Corona Second Wave: ఏపీలో దడ పుట్టిస్తోన్న కరోనా వైరస్, రోజుకు 6 వేలు దాటుతోన్న కేసులు

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒక్కరోజులో 2 లక్షల 60 వేల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అటు ఏపీలో కూడా అదే పరిస్థితి.

దేశమంతా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) వ్యాపిస్తున్నట్టే తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజుల్నించి కేసుల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతోంది. ప్రతిరోజూ 5-7 వేల మధ్య కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 7 వేల పై చిలుకు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రమంతటా కరోనా వైరస్ దడ పుట్టిస్తోంది. పట్టణాలు .. గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు సెల్ఫ్‌ లాక్‌డౌన్( Self Lockdown) పాటిస్తున్నారు. తమ ఊరికి ఎవరు రావద్దని కోరుతున్నారు. 

మరోవైపు కంటైన్మెంట్‌ జోన్లలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు ( Coronavirus cases) తీవ్రం కావడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని సీఎం జగన్‌ (Ap cm ys jagan) ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోసారి కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు జగన్‌. కరోనా నియంత్రణకు యాక్షన్‌ ప్లాన్‌పై కసరత్తు చేస్తున్నారు అధికారులు. రేపు అంటే ఏప్రిల్ 19వ తేదీన జరిగే భేటీలో రాష్ట్రంలో కరోనా ఆంక్షలు, కోవిడ్ వైద్యసేవలపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అటు, తిరుమల శ్రీవారి దర్శనాలపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కరోన వైరస్ వ్యాప్తి కారణంగా టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి  3 వందల రూపాయల దర్శన టికెట్లు 15 వేలు మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించింది. 

Also read: Tirupati by polls: తిరుపతి ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్ శాతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News