Ys jagan on lockdown: లాక్‌డౌన్ విధిస్తే..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ys jagan on lockdown: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రల్లో కూడా లాక్‌డౌన్‌పై ఒత్తిడి వస్తున్న నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని బట్టి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 28, 2021, 11:29 AM IST
Ys jagan on lockdown: లాక్‌డౌన్ విధిస్తే..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ys jagan on lockdown: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రల్లో కూడా లాక్‌డౌన్‌పై ఒత్తిడి వస్తున్న నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని బట్టి..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) అత్యంత భయంకరంగా విస్తరిస్తోంది. కరోనా దారుణ పరిస్థితులతో దేశంలో అల్లకల్లోలం నెలకొంది. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ పాటిస్తున్నాయి.ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజుకు 9 నుంచి 10 వేల కేసులు నమోదవుతుండటం, రోజురోజుకూ కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్ ( Lockdown Demand) విధించాలన్న డిమాండ్ ఎక్కువగా విన్పిస్తోంది. లాక్‌డౌన్ ఒక్కటే కరోనా నియంత్రణకు పరిష్కారమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం (Ap government) ఏం ఆలోచిస్తుందనేది వేచి చూడాలి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

లాక్‌డౌన్ విధిస్తే ఎక్కువగా నష్టపోయేది ప్రజలేనని వైఎస్ జగన్ ( Ap cm ys jagan) తెలిపారు. లాక్‌డౌన్‌తో ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువ ప్రతికూల ఫలితాలు చవిచూస్తారని తెలిపారు. లాక్‌డౌన్ ( Lockdown) వల్ల ప్రభుత్వానికి 1 రూపాయి నష్టం కలిగితే..ప్రజలకు నాలుగు రూపాయలు నష్టం వాటిల్లుతుందని వైఎస్ జగన్ వివరించారు. లాక్‌డౌన్ గురించి ఆలోచించేటప్పుడు ఇది చాలా కీలకాంశంగా పరిగణించాలని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యత( Oxygen Availability) ప్రస్తుత అవసరాల దృష్ట్యా సరిపోతుందన్నారు. ఇప్పుడు రోజుకు 340 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తోందన్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 11 వేల 434 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇక 104 కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా పనిచేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని జగన్ సూచించారు. 104కు ఫోన్ చేసినప్పుడు తక్షణం పరిష్కారం ఉండాలన్నారు. కోవిడ్‌పై వదంతులు సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని, అరెస్టులు చేయాలని ఆదేశించారు.

Also read: RTC Services: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధనలు, ఆర్టీసీలో 50 శాతమే ఆక్సుపెన్సీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News