ఉగ్రవాదంపై అనుకున్నంత స్థాయిలో పోరాడేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తూ పాకిస్తాన్కు రూ.2,130 కోట్ల ఆర్థిక సాయాన్ని రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది.
పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి షిరీన్ మజారీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రధాన సమస్యగా పరిగణిస్తున్న వంటి కాశ్మీర్ వివాదానికి ఒక పరిష్కారం ఉండాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అక్కడ పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాని కౌగలించుకోవడం ఓ దుశ్చర్య అని.. ఈ పనిచేసినందుకు సిద్ధూకు భారత ప్రభుత్వం మరణశిక్ష విధించినా తప్పు లేదని బీజేపీ మైనార్టీ మోర్చా నేత అఫ్తాబ్ అద్వానీ అన్నారు.
9/11 దాడుల ప్రధాన సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ చాలా మంచి బాలుడని.. చిన్నప్పుడు చాలా శాంత స్వభావం కలిగి ఉండేవాడని.. అయితే చెడు మార్గంలో వెళ్లడం వల్లే తన జీవితాన్ని తలకిందులైందని ఆయన తల్లి అలియా గానెమ్ తెలిపారు.
పాకిస్తాన్ ఎన్నికల్లో ఇటీవలే గెలిచి ప్రధాని అవ్వడం కోసం చిన్న చితకా పార్టీల మద్దతు కోరుతున్న ఇమ్రాన్ ఖాన్.. ఒకవేళ తాను ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తే ఆ మహోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తానని తెలపడం గమనార్హం.
ఇటీవలే జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ రిగ్గింగ్ వల్లే గెలిచారని ఆయన మాజీ భార్య రెహం ఖాన్ ఆరోపణలు చేశారు
పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించి కాశ్మీర్ ఓ ప్రధాన సమస్యని.. అయితే దానిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదైంది. జింబాబ్వేతో జరిగిన నాల్గవ వన్డే సిరీస్లో పాకిస్తాన్ క్రికెటర్ ఫకర్ జమాన్ తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదు చేశారు.
పాకిస్తాన్లో జులై 25వ తేదిన జరిగే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు మతతత్వ పార్టీలతో పాటు ప్రభుత్వం బ్యాన్ చేసిన జామత్ ఉద్ దవా పార్టీ మెంబర్లు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలలో పిల్లల సోషల్ స్టడీస్ టెక్స్ట్ పుస్తకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. పలు ప్రైవేటు పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో కాశ్మీర్ భారతదేశంలో ఉందని తెలియజేసే మ్యాపులు ప్రచురితమవ్వడమే అందుకు కారణం.
కేంద్ర హోంశాఖ సోమవారం భారత్, పాకిస్తా్న్ సరిహద్దు ప్రాంతాల్లో గల కథువా, సాంబా, జమ్ము, రాజౌరి, పూంచ్ జిల్లాల దగ్గర 14,000 బంకర్లు నిర్మించడానికి రూ.415 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఒకవైపు పాకిస్తాన్ హింసను ప్రేరేపిస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతుంటే.. ఇక చర్చలతో ప్రయోజనం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు.
పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.