Wriddhiman Saha: 'అతడు నన్ను రిటైరవమన్నాడు'.. ద్రవిడ్‌, దాదాలపై సాహా షాకింగ్ కామెంట్స్

Wriddhiman Saha:  టీమ్‌ఇండియా సీనియర్‌ టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 11:17 AM IST
Wriddhiman Saha: 'అతడు నన్ను రిటైరవమన్నాడు'.. ద్రవిడ్‌, దాదాలపై సాహా షాకింగ్ కామెంట్స్

Wriddhiman Saha Shocking comments: ఇటీవల భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)తనని రిటైర్మెంట్‌ గురించి ఆలోచించమని సూచించినట్లు సాహా బయటపెట్టాడు. మార్చిలో శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కు శనివారం జట్టును ప్రకటించింది టీమిండియా. అయితే సీనియర్  ఆటగాళ్లు రహానే, పూజారా, ఇషాంత్ శర్మలతో పాటు సాహాను కూడా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు సాహా. 

''ఇకపై జట్టు ఎంపికలో నన్ను పరిగణనలోకి తీసుకోబోమని టీమ్ మేనేజ్‌మెంట్ ముందే చెప్పింది. కోచ్ ద్రవిడ్ రిట్మైర్మెంట్ గురించి ఆలోచించాలని సూచించాడు. తాను బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం దేని గురించీ ఆలోచించాల్సిన పని లేదని దాదా తనతో చెప్పారు. కానీ పరిస్థితులు ఇంత వేగంగా ఎలా మారాయో నాకు అర్థం కావడం లేదు'' అని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. గత నవంబరులో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో తాను 61 పరుగులు చేసినపుడు..దాదా (BCCI president Sourav Ganguly) వాట్సాఫ్ ద్వారా అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా సాహా పేర్కొన్నాడు. 

జర్నలిస్టుపై సాహా ఆగ్రహం...

ఇదిలా ఉండగా...ఓ జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఈ సీనియర్ వికెట్ కీపర్. ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం బలవంతం చేశాడని..అయితే తాను స్పందించకపోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని సాహా వెల్లడించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను సాహా బయటపెట్టాడు. జర్నలిజం ఇంత దిగజారిపోయిందా.. అంటూ సాహా విచారణ వ్యక్తం చేసాడు. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా స్పందించాడు. ఈ ఘటన చాలా విచారకరమని అన్నాడు. 

Also Read; IND vs SL: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌.. నలుగురు సీనియర్ ఆటగాళ్లకు దక్కని చోటు! ఇక అంతే సంగతులా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News