క్రికెట్ చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ పట్టిన క్యాచ్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. తొలుత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది.
ఆసీస్ బ్యాటింగ్‌కు దిగాక పాట్ కమిన్స్ అర్థ సెంచరీ చేసి 62వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. ఆసీస్ కెప్టెన్ టిమ్ ఫైన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. వికెట్లు కుప్పకూలుతున్నా ఆచితూచి ఆడుతూ.. బౌలర్ల నుండి తప్పించుకుంటూ మందుకు వెళ్లసాగాడు ఫైన్. అయితే తాను 62 పరుగుల వద్ద ఉండగా.. రబాడ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని గట్టిగా కొట్టాడు ఫైన్. కానీ ఎల్గర్ డైవ్ చేసి మరీ ఆ క్యాచ్‌ను పట్టుకోవడంతో ఫైన్ అవుటయ్యాడు.
అయితే.. ఎల్గర్ డైవ్ చేసిన విధానం మాత్రం క్రికెట్ అభిమానులను విస్మయపరిచింది. సెకన్ల వేగంతో గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్న తీరు ఫ్యాన్స్‌ని అబ్బురపరిచింది. ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు ఈ క్యాచ్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ అని కితాబులిచ్చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌లోని క్యాచ్‌లన్నింటిలోకీ ఇదే అద్భుతమైన క్యాచ్ అని అభినందనల వర్షం కూడా కురిపించేస్తున్నారు. మరి మీరు కూడా ఆ క్యాచ్ ఎల్గర్ ఎలా పట్టాడో చూసి ఎంజాయ్ చేసేయండి
Outrageous Dean Elgar. One of the best outfield catches you'll see #SAvAUS pic.twitter.com/ubobOaII5C
— Ricky Mangidis (@rickm18) April 1, 2018
టెస్టు క్రికెట్‌లో మరికొన్ని అద్భుతమైన క్యాచ్‌లను ఇక్కడ చూసేయండి
VIDEO: క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది..ఎల్గర్ పట్టిన క్యాచ్