విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్!

టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. 

Last Updated : Feb 20, 2018, 05:11 PM IST
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్!

టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. టెస్టులు, వన్డే మ్యాచ్‌ ఫార్మాట్లలో కలిపి 900 పాయింట్స్ మార్క్ దాటిన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కన్నా ముందు స్థానంలో వున్న ఆటగాడు ఇంకెవరో కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కోహ్లీకి బెస్ట్ ఫ్రెండ్ అయిన సౌతాఫ్రికన్ క్రికెటర్ ఏబీ డివిలియర్సే. అవును, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో 900 పాయింట్స్ దాటిన ఆటగాళ్లు కేవలం ఐదుగురు కాగా అందులో కోహ్లీ రెండో స్థానంలో వుండటం విశేషం. ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్‌లో చెలరేగిపోయి ఆడిన కోహ్లీ.. ఏకధాటిగా మూడు సెంచరీలు చేయడంతో అతడు ఈ విజయం అందుకోవడం సులభమైంది.

ఇక టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా బౌలర్ల కేటగిరీలో ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో జాయింట్ టాప్ పొజిషన్ అందుకోవడం మరో విశేషం.  

Trending News