Ind vs Nz 1st ODI Match at Uppal Stadium: ఇండియా vs న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా జనవరి 18న జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ డి.ఎస్. చౌహన్ తాజాగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే వారి కోసం చేపట్టిన ఏర్పాట్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ డి.ఎస్. హౌహన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం అని అన్నారు. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉండేందుకు వివిధ స్థాయిల్లో 2500 మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
రేపు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. క్రికెట్ వీక్షించడానికి స్టేడియంకు వచ్చే వారి మధ్య తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచే లోపలికి అనుమతించనున్నట్టు రాచకొండ సీపీ చౌహన్ స్పష్టంచేశారు. సాయంత్రం గ్రౌండ్లో క్రౌడ్ పెరిగే అవకాశం ఉందని... గ్రౌండ్ లోపలికి ఎవ్వరూ ప్రవేశించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా మైదానంలోకి ప్రవేశిస్తే.. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
🗣️🗣️'Siraj is an important player for India'
Hear what #TeamIndia captain @ImRo45 has to say on local lad @mdsirajofficial ahead of the first #INDvNZ ODI in Hyderabad pic.twitter.com/XoSSOplZ20
— BCCI (@BCCI) January 17, 2023
మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే వారి కోసం స్టేడియానికి దారి తీసే అన్ని మార్గాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. పార్కింగ్ కోసం నిర్ధేశించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది. రద్దీని అదనుగా తీసుకుని మహిళలు పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆకతాయిలను హెచ్చరించారు. స్టేడియం పరిసరాల్లో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌తో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఉప్పల్ స్టేడియంకు దారి తీసే మార్గాల్లో వెళ్లే వారు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ట్రాఫిక్ రద్దీ అవకుండా సహకరించగలరని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. క్రికెట్ ప్రియుల ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు బ్లాక్‌లో టికెట్స్ విక్రయించాలని ప్రయత్నిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని రాచకొండ సీపీ చౌహన్ హెచ్చరికలు జారీచేశారు.
ఇది కూడా చదవండి : Uppal Stadium Match Tickets: ఉప్పల్ స్టేడియం టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్
ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook