T20 World Cup Records: టీ20 ప్రపంచకప్ ప్రత్యేకతలు, రికార్డుల వివరాలు ఇలా

T20 World Cup Records: క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యంత ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్‌లో ఆరు ప్రపంచకప్‌లు జరుగగా ఎన్నో రికార్డులు..మరెన్నో ప్రతేకతలు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 19, 2021, 02:34 PM IST
  • టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు రికార్డు విరాట్ కోహ్లీదే
  • టీ20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డుతో క్రిస్గేల్
  • టీ20 వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు యువరాజ్ సింగ్
T20 World Cup Records: టీ20 ప్రపంచకప్ ప్రత్యేకతలు, రికార్డుల వివరాలు ఇలా

T20 World Cup Records: క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యంత ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్‌లో ఆరు ప్రపంచకప్‌లు జరుగగా ఎన్నో రికార్డులు..మరెన్నో ప్రతేకతలు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.

ICC T20 World Cupలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చాలా ప్రపంచ రికార్డులు సృష్టించి ఉన్నాయి. క్రికెట్‌లో టీ20 ఫార్మాట్(T20 Format)వచ్చినప్పటి నుంచీ చాలా ఆదరణ లభించింది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్‌లో ఆరు ప్రపంచకప్‌లు నిర్వహించారు. ఇప్పటి వరకూ జరిగిన టీ20 ప్రపంచకప్‌లు, విశేషాలు, ప్రత్యేకతలు, రికార్డులు పరిశీలిద్దాం. ఈ ఫార్మాట్‌పై పెరుగుతున్న ప్రజాదరణతోనే అంతర్జాతీయ క్రికెట్‌లో చేర్చారు. ప్రపంచంలో మొట్టమొదటి టీ20 మ్యాచ్ 2004లో ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య స్వేహపూర్వకంగా జరిగింది. 

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup)అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే పేరుపై నమోదై ఉంది. అతడు 31 ఇన్నింగ్స్‌లలో 39.07 సగటుతో 6 హాఫ్ సెంచరీలు , 1 సెంచరీతో 1 వేయి 16 పరుగులు సాధించాడు. ఇండియా విషయంలో టాప్ 5 జాబితాలో విరాట్ కోహ్లి(Virat Kohli)ఒక్కడే ఉన్నాడు. అతడు 16 మ్యాచ్‌లలో 86.33 యావరేజ్‌తో 777 పరుగులు సాధించాడు. ఇక అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బ్రెండమ్ మెకల్లమ్ కలిగి ఉన్నాడు. 2012లో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో మెకల్లమ్ 58 బంతుల్లో 123 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 11 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు అత్యధిక సెంచరీల రికార్డు వెస్టిండీస్‌కు చెందిన క్రిస్‌గేల్(Chris Gale)పేరుమీద ఉంది. టీ20 ప్రపంచకప్‌లో క్రిస్‌గేల్ రెండు సెంచరీలు సాధించాడు. సెంచరీల జాబితాలో ఇతరదేశాల ఆటగాళ్లు ఒక్కొక్క సెంచరీ కలిగి ఉన్నారు. 

ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు(Fastest Century Record) కూడా క్రిస్‌గేల్ పేరుమీదే ఉంది. 2016లో ఇంగ్లండ్ జట్టుపై 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఇండియాకు చెందిన యువరాజ్ సింగ్(Yuvraj Singh)పేరుమీద ఉంది. 2007లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించాడు. కేవలం 12 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రికార్డు సాధించాడు. అత్యధిక భాగస్వామ్యాన్ని శ్రీలంకకు చెందిన జయవర్ధనే, సంగక్కరల పేరుపై ఉంది. 2010 వరల్డ్‌కప్‌లో 166 పరుగులు సాధించారు. టీ20 ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ఉంది. ఇక అత్యధిక హాఫ్ సెంచరీలను మాథ్య హేడెన్, విరాట్ కోహ్లిలు 28 హాఫ్ సెంచరీలు చేశారు. ఒక టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు రికార్డు విరాట్ కోహ్లి పేరుపై ఉంది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 319 పరుగులు సాధించాడు. అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా క్రిస్‌గేల్ పేరుమీదే ఉంది. అతడు 60 సిక్సర్లు కొట్టాడు.

Also read: India vs England warm-up match: వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా ఘన విజయం.. మెరిసిన Ishan Kishan, KL Rahul

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News