Sourav Ganguly admitted to Kolkata Woodlands hospital | న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో శనివారం చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు వైద్యులు శనివారం (Sourav Ganguly Health Updates) సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
Sourav Ganguly has undergone angioplasty. He is stable now. He will be monitored for 24 hours. He is completely conscious. There are two blockages in his heart for which he will be treated: Dr Aftab Khan, Woodlands Hospital, Kolkata. pic.twitter.com/ackcaGwJKu
— ANI (@ANI) January 2, 2021
గంగూలీ (Sourav Ganguly) కి ఇప్పటికే యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశామని, మరో రెండు స్టెంట్లు ఆది, సోమవారాల్లో వేయాల్సి ఉందని వెల్లడించారు. మరో 48 గంటల పాటు ఆయన హాస్పిటల్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మెలుకువతోనే ఉన్నారని వుడ్‌ల్యాండ్స్ వైద్యుడు ఆఫ్తాబ్ ఖాన్ తెలిపారు. Also read: Sourav Ganguly: దాదాకు గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక
మొత్తంగా మరో వారం రోజుల పాటు గంగూలీకి చికిత్స కొనసాగుతుందని.. 24గంటలపాటు పూర్తిగా పర్యవేక్షించనున్నట్లు (Kolkata) వైద్యులు తెలిపారు. ఇదిలాఉంటే.. దాదా త్వరగా కోలుకోవాలంటూ తాజా, మాజీ క్రికెటర్లు ట్విట్లు చేసి ఆకాంక్షిస్తున్నారు. Also Read: Akhilesh Yadav: వారి వ్యాక్సిన్‌ను నమ్మను.. తీసుకోను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook