Virender Sehwag says Zaheer Khan suggested me as a Opener: క్రికెట్ ఆటలో ఓపెనింగ్ జోడి కీలక పాత్ర పోషిస్తుంది. టెస్ట్, వన్డే, టీ20.. ఫార్మాట్ ఏదైనా ఓపెనింగ్ జోడీ చేసే పరుగుల మీదే జట్టు విజయం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో అత్యుత్తమ ఓపెనింగ్ జోడిలు ఉన్నాయి. సచిన్ టెండ్యూలర్-సౌరవ్ గంగూలీ, ఆడం గిల్‌క్రిస్ట్-మాథ్యూ హేడెన్, సిజి గ్రీనిడ్జ్-డిఎల్ హేన్స్, మైఖేల్ అథర్టన్-గ్రాహం గూచ్ లాంటి ఓపెనింగ్ జోడీలు ఎంతో ఫేమస్. సచిన్ టెండ్యూలర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడి కూడా ఆ కోవలోకే వస్తుంది. అయితే మిడిలార్డర్‌లో ఆడే వీరూ ఓపెనర్‌గా రావడానికి కారణం టీమిండియా మాజీ బౌలర్.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీనే వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా రావడానికి కారణం అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే గంగూలీ నాయకత్వంలోనే సెహ్వాగ్ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే వీరూ ఓపెనర్‌గా రాడానికి కారణం భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ అట. ఈ విషయాన్ని స్వయంగా వీరూనే చెప్పాడు. ఓ క్రీడా ఛానల్‌లో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌తో సెహ్వాగ్ ప్రత్యేక చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్బంగా అసలు విషయాన్ని బయటపెట్టాడు.
చిట్‌చాట్‌లో భాగంగా నిన్ను ఓపెనింగ్‌కు పంపించాలనేది ఎవరి ఐడియానో ఓసారి చెపుతారా వీరేంద్ర సెహ్వాగ్ అని షోయబ్ అక్తర్ అడిగాడు. 'నన్ను ఓపెనర్‌గా పంపించాలనేది జహీర్ ఖాన్ ఐడియా. ఇదే విషయాన్ని అప్పటి మా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి జహీర్ చెప్పాడు. దాంతో అప్పటి వరకూ మిడిలార్డర్‌లోనే ఆడే నేను ఓపెనర్‌గా వచ్చాను. నీకు (షోయబ్) ఓ విషయం చెప్పాలి.. తొలిసారి నిన్ను 1999లో మిడిలార్డర్ బ్యాటర్‌గానే ఎదుర్కొన్నా' అని వీరూ బదులిచ్చాడు.
డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడేవాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్స్ బాదిన ప్లేయర్ కూడా వీరూనే. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా ఒకేలా ఆడేవాడు. సెహ్వాగ్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు హడలే. టెస్టుల్లో రెండు ట్రిబుల్ సెంచరీలను నమోదు చేశాడు అంటే ఎలా వాడెవడో అర్ధం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కెరీర్‌లో సెహ్వాగ్ 104 టెస్టుల్లో, 251 వన్డేల్లో, 19 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: నేడు శ్రీకృష్ణాష్టమి.. ఈ 4 రాశుల వారికి సిరిసంపదలు వెల్లువెత్తుతాయి!
Also Read: Weight Loss Tips: ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం 7 రోజుల్లో ఇలా బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook