సచిన్ అయ్యాడు 'వంట' మాస్టర్..!

క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండుల్కర్ వంటవాడి అవతారమెత్తాడు.

Last Updated : Jan 2, 2018, 02:17 PM IST
సచిన్ అయ్యాడు 'వంట' మాస్టర్..!

క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండుల్కర్ వంటవాడి అవతారమెత్తాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన స్నేహితులకు తానే స్వయంగా వంట చేసి అమోఘమైన రుచులను తినిపించాడు. ఆ తర్వాత తన వంటకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 'న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా నా మిత్రుల కోసం కొన్ని ప్రత్యేక వంటకాలు చేస్తున్నా. నా వంట అందరికీ ఇష్టమే. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని సచిన్ తన సందేశాన్ని కూడా ఈ వీడియోతో  పాటు తన అభిమానుల కోసం పోస్టు చేశాడు. సచిన్ చేతివంట తిన్న మిత్రుల్లో ప్రధానంగా యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్లు ఉండడం విశేషం. ఒక చిత్రమైన టోపీ పెట్టుకొని.. తన స్నేహితులతో ఫోటో దిగిన సచిన్ దానిని కూడా ట్విటర్‌లో పోస్టు చేశాడు. సచిన్ స్వయంగా ముంబయిలో ఓ రెస్టారెంటుకి యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే 

 

Trending News