Ind Vs SL 3rd Odi: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా అనూహ్య ఓటమి బిగ్‌షాక్‌కు గురిచేసింది. తొలి వన్డేలోనే గట్టి పోటినిచ్చిన లంకేయులు రెండో వన్డే దెబ్బతీశారు. టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగా.. భారత్ 208 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 32 పరుగులతో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా వన్డే సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే చివరి వన్డేలో తప్పకుండా నెగ్గాల్సిందే. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నా.. భారత్ ఓటమిపాలు కావడం అభిమానులను బాధిస్తోంది. మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ నయా ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సిరీస్‌ను సమం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మూడో వన్డేలో శివమ్ దూబే స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పంత్ శ్రీలంక స్పిన్నర్లను శివమ్ దూబే కంటే మెరుగ్గా ఆడగలడు. దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టగలడు. రెండో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దూబే.. నాలుగు బంతులు ఎదుర్కొన్ని డకౌట్‌గా వెనుదిరిగాడు. బౌలింగ్‌లో కూడా శివమ్ దూబే వికెట్ తీయలేదు. 2 ఓవర్లలో 10 పరుగులిచ్చాడు. హార్దిక్ పాండ్యా లేని లోటును దూబే భర్తీ చేయలేకపోయాడు. తొలి వన్డేలో చివరి 15 బంతుల్లో టీమిండియా ఒక పరుగు చేయాల్సి ఉండగా.. దూబే ఔట్ అవ్వడం, ఆ వెంటనే అర్ష్‌దీప్ సింగ్ ఔట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ చేజార్చుకుని.. టైతో సరిపెట్టుకుంది.
శ్రీలంకతో మొదటి రెండు వన్డేలలో ఫ్లాప్ పర్ఫామెన్స్‌తో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం ఆసన్నమైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో బుధవారం మూడో జరగనుంది. ప్రస్తుతం టీమిండియా 0-1తో వెనుకబడింది. రోహిత్ శర్మ సేన సిరీస్‌ను 1-1తో సమం చేయాలంటే మూడో వన్డేను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందే.
Also Read: Stock market crashes:స్టాక్ మార్కెట్లలో రక్త పాతం...రూ. 10 లక్షల కోట్ల సొమ్ము ఆవిరి..కారణాలు ఇవే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.