Murali Vijay Retirement: మురళి విజయ్ రిటైర్మెంట్.. కొత్త లైఫ్ షురూ

Murali Vijay Retirement News:  సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ న్యూస్ ప్రకటించిన మురళి విజయ్.. 2002 నుంచి 2018 వరకు అద్భుతమైన క్రికెట్ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నాడు. ఓపెనర్ గా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని మురళి విజయ్ ఆనందం వ్యక్తంచేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2023, 04:28 PM IST
Murali Vijay Retirement: మురళి విజయ్ రిటైర్మెంట్.. కొత్త లైఫ్ షురూ

Murali Vijay Retirement News: టీమిండియా మాజీ ఓపెనర్ మురళి విజయ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. 38 ఏళ్ల వయస్సులో మురళి విజయ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008 నుంచి 2015 వరకు ఏడేళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికట్‌లో టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించిన మురళి విజయ్.. తన కెరీర్ లో 61 టెస్ట్ మ్యాచ్ లు, 17 వన్డేలు, 9 టీ20 మ్యాచ్ లు ఆడాడు. తమిళనాడు నుంచి రంజీ మ్యాచులకు ప్రాతినిథ్యం వహించిన మురళి విజయ్.. ఐపిఎల్ కెరీర్లో 106 మ్యాచ్ లు ఆడి 121.87 స్ట్రైక్ రేట్ తో 2,619 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 13 హాఫ్ సంచరీలు ఉన్నాయి. ఐపిఎల్ టోర్నీల్లో చెన్నై సూపర్ కింగ్స్, డిల్లీ డేర్ డివిల్స్ ( ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్), అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( ప్రస్తుత పంజాబ్ కింగ్స్) జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ న్యూస్ ప్రకటించిన మురళి విజయ్.. 2002 నుంచి 2018 వరకు అద్భుతమైన క్రికెట్ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నాడు. ఓపెనర్‌గా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని మురళి విజయ్ ఆనందం వ్యక్తంచేశాడు. క్రికెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలు కోసం అన్వేషిస్తున్నట్టు స్పష్టంచేసిన మురళి విజయ్.. ఇకపై తన క్రీడా జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమవనుంది అని అభిప్రాయపడ్డాడు. 

 

దేశం కోసం తనతో కలిసి ఆడిన అప్పటి టీమిండియా జట్టుకు, ప్రస్తుత టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ మురళి విజయ్ ఇంటర్నేషనల్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాడు. 2018 లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా పెర్త్‌లో మురళి విజయ్ తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత పరుగులు సాధించడంలో వెనుకబడిన మురళి విజయ్‌ని బిసిసిఐ జట్టు లోంచి తొలగించింది. ఆ తరువాత మురళి విజయ్‌కి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మరో అవకాశం రాలేదు. రంజీ ట్రోఫీలో 2019 లో తమిళనాడు తరపున చివరి మ్యాచ్ ఆడిన ఈ ఆటగాడు తమిళ నాడు ప్రీమియర్ లీగ్ ( టిఎన్‌పిఎల్ ) లోనూ ఎంట్రీ ఇచ్చాడు. బిసిసిఐ నుంచి పిలుపు కోసం ఎంతో కాలం పాటు ఆశగా వేచిచూసిన మురళి విజయ్.. పలు సందర్భాల్లో బిసిసిఐ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

ఇది కూడా చదవండి : Prithvi Shaw: రెండో గర్ల్‌ఫ్రెండ్‌తోనూ పృథ్వీ షా బ్రేకప్.. ఆ సాంగ్‌తో కన్మార్మ్

ఇది కూడా చదవండి : Yuzvendra Chahal: భువనేశ్వర్‌ కుమార్‌ రికార్డు బద్దలు.. తొలి బౌలర్‌గా యుజ్వేంద్ర చహల్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News