ధోని వేతనాన్ని బీసీసీఐ తగ్గించనుందా..?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వేతనంలో మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Last Updated : Jan 4, 2018, 05:30 PM IST
ధోని వేతనాన్ని బీసీసీఐ తగ్గించనుందా..?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వేతనంలో మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమిండియాకి ఆడే ప్లేయర్లను నాలుగు క్యాటగరీలుగా (ఏ ప్లస్, ఏ, బీ.సీ) విభజించారు. అందులో ఏ ప్లస్ క్యాటగరీని ఈ మధ్యకాలంలోనే ప్రత్యేకంగా చేర్చారు. వన్డే, టెస్టులతో పాటు టీ20 కూడా ఆడే టాప్ ఆటగాళ్లను మాత్రమే ఈ క్యాటగరీలోకి తీసుకుంటారు. వారి వేతనాలను కూడా ఊహించని రీతిలో భారీ స్థాయిలో పెంచనున్నారు.

అయితే 2014 సంవత్సరంలోనే టెస్టు క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోనిని ప్రస్తుతం ఏ ప్లస్ క్యాటగరీలో చేర్చాలా వద్దా అన్న ఆలోచనలో పడింది బీసీసీఐ. ఒకవేళ ఆ క్యాటగరీలోకి తీసుకోలేకపోతే.. ఆ క్యాటగరీ ప్లేయర్ల కంటే తక్కువ వేతనాన్ని ధోని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధోనికి కూడా ఏ ప్లస్ క్యాటగరీ ఇస్తే.. అతను ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడడం లేదు కాబట్టి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఏ క్యాటగరీ ఆటగాళ్లకు సంవత్సరానికి కోటి రూపాయల నుండి రెండు కోట్ల రూపాయలను చెల్లిస్తోంది బీసీసీఐ. అయితే ఈ వేతన స్కేలు పట్ల కినుక వహిస్తున్న క్రీడాకారుల ఆమోదం పొందేలా కొత్త వేతనాలను త్వరలోనే బీసీసీఐ అమలులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. 

Trending News