Kapil Dev Shocking Comments: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్థానంపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్లమెంట్‌లో టీమిండియా కప్ గెలిచే అవకాశాలపై కొంతమంది మాజీ లెజెండ్స్ టీమిండియాకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ.. మరో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం తన వ్యాఖ్యలతో టీమిండియా పక్కలో బాంబు పేల్చినంత పనిచేశాడు.

Written by - Pavan | Last Updated : Oct 20, 2022, 02:42 AM IST
  • టీమిండియా పక్కలో బాంబు పేల్చిన కపిల్ దేవ్
  • టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్థానంపై సంచలన వ్యాఖ్యలు
  • 30 శాతం అవకాశాలే అంటున్న కపిల్ దేవ్
Kapil Dev Shocking Comments: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్థానంపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 సమీపిస్తున్న కొద్దీ ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆట సామర్ధ్యంపై ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. మరీ ముఖ్యంగా టీమిండియా సచిన్ టెండుల్కర్, రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెట్ స్టార్స్, క్రికెట్ లెజెండ్స్ ఈ టోర్నమెంట్‌లో భారత్ ఈజీగా సెమీ-ఫైనల్స్‌కి దూసుకుపోతుందని అంచనాలు వ్యక్తంచేస్తూ టీమిండియాకు భారీ బూస్టింగ్ ఇస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెట్ లెజెండ్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతుండగా.. మరోవైపు మరో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత్ సునాయసంగానే సెమీ-ఫైనల్స్‌కి చేరుతుందని కొంతమంది క్రికెట్ లెజెండ్స్ జోస్యం చెబుతుంటే.. కపిల్ దేవ్ మాత్రం తనకు అలా అనిపించడం లేదంటున్నాడు. అంతేకాదు.. అసలు టీమిండియా సెమీ-ఫైనల్స్‌కి చేరే అవకాశాలు కూడా తక్కువేనని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. టాప్ - 4 రేసులో టీమిండియా స్థానం దక్కించుకుంటే తప్ప భారత్‌కి ఉన్న అవకాశాలపై ఏమీ చెప్పలేనన్నాడు. 

టీ20 క్రికెట్ రెగ్యులర్ ఫార్మాట్ కంటే భిన్నమైంది. ఒక మ్యాచ్ గెలిచిన జట్టు ఆ నెక్ట్స్ మ్యాచ్ గెలుస్తుందన్న గ్యారెంటీ ఉండదు. అందుకే టీమిండియా ఈ వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంటుందని తాను అనుకోవడం లేదని కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చాడు. 

టీ20 వరల్డ్ కప్ 2022 ఛాంపియన్స్ సంగతి అలా పక్కనపెడితే.. అసలు టాప్ 4 లోకి టీమిండియా ప్రవేశిస్తుందా లేదా అనేదే అసలు సమస్య. టీమిండియా టాప్ 4 లోకి ప్రవేశించే అవకాశాలు 30 శాతం మాత్రమే ఉన్నాయి అని చెప్పి టీమిండియా పక్కలో బాంబు పేల్చినంత పనిచేశాడు. లక్నోలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది. హోస్ట్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాకు, గత టోర్నమెంట్ లో ఫైనలిస్ట్ అయిన న్యూజీలాండ్ జట్ల మధ్య తొలి సమరం జరగనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఈ పోటీకి వేదిక కానుంది. 

ఇదిలావుంటే, మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అధిక శాతం మ్యాచులపై వరుణుడి ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ క్రికెట్ ప్రేమికులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టీమిండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌పై ( India vs Pakistan Match ) కూడా వరుణుడు దోబూచులాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేకానీ జరిగితే.. ఒక వరల్డ్ క్లాస్ మ్యాచ్ చూడాలని ఆశ పడుతున్న క్రికెట్ ప్రియుల ఆశలన్నీ గల్లంతయినట్టే. వాస్తవానికి ఏం జరగనుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Also Read : Pakistan Boycott World Cup: పాక్ అనూహ్య నిర్ణయం..! వరల్డ్ కప్‌కు దూరం..?

Also Read : Junaid Siddique Six: బాప్‌రే.. ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్‌! వైరల్ అయిన యూఏఈ ప్లేయర్ సెలెబ్రేషన్స్

Also Read : Mohammad Shami: మహమ్మద్‌ షమీని చూసి ఆశ్చర్యపోయాం: ఆకాశ్‌ చోప్రా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News