IPL 2023 KKR: ఐపీఎల్‌ 2023కి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మరో షాక్.. గాయం బారిన పడ్డ స్టార్ ప్లేయర్!

KKR Pacer Lockie Ferguson injured ahead of IPL 2023. ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మరో షాక్ తగిలింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Mar 23, 2023, 07:51 PM IST
  • ఐపీఎల్‌ 2023కి ముందు కోల్‌కతాకు మరో షాక్
  • గాయం బారిన పడ్డ స్టార్ ప్లేయర్
  • ఏప్రిల్‌ 2న పంజాబ్‌ కింగ్స్‌తో ఢీ
IPL 2023 KKR: ఐపీఎల్‌ 2023కి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మరో షాక్.. గాయం బారిన పడ్డ స్టార్ ప్లేయర్!

KKR Pacer Lockie Ferguson injured ahead of IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2023 ప్రారంభానికి ముందు మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మరో షాక్ తగిలింది. ఇప్పటికే వెన్ను సమస్య కారణంగా కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్ 2023కి దూరం కాగా.. తాజాగా న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ లాకీ  ఫెర్గూసన్‌ గాయం బారిన పడ్డాడు. అతడికి మోచేతి గాయం అయినట్టు తెలుస్తోంది. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్‌కు ముందు ఫెర్గూసన్‌కు గాయం అయినట్టు వెలుగులోకి వచ్చింది.

లాకీ  ఫెర్గూసన్‌ మార్చి 25న శ్రీలంకతో జరిగాల్సిన తొలి వన్డే నుంచి తప్పుకున్నాడు. అయితే అతడి స్థానంలో ​న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంకతో తొలి వన్డేకు మాత్రం ఫెర్గూసన్‌ దూరంగా ఉంటాడని కివీస్‌ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఫెర్గూసన్‌ గాయం తీవ్రతపై కివీస్ క్రికెట్‌ బోర్డు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గాయంపై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో.. కేకేఆర్‌ యాజమాన్యం ఆందోళన చెందుతుంది. ఇప్పటికే శ్రేయస్‌ అయ్యర్‌ సేవలు కోల్పోయిన కేకేఆర్‌.. ఫెర్గూసన్‌ సేవలను కూడా కోల్పోతే విజయావకాశాలు తగ్గుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

లాకీ ఫెర్గూసన్‌ ఐపీఎల్ 2023 ఆరంభపు మ్యాచ్‌లకు దూరమైనా లేదా పూర్తిగా దూరమయినా పేస్‌ బౌలింగ్‌ భారమంతా కివీస్ సీనియర్ టిమ్‌ సౌథీపై పడుతుంది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మరో ఆప్షన్స్. తొలి వన్డే తర్వాత ఫెర్గూసన్‌ ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌కు పయనమవ్వాల్సి ఉంది. ఇక ఐపీఎల్ 2023 ఆరంభానికి మరో వారం రోజులు ఉన్నా.. కేకేఆర్‌ ఇప్పటికీ నూతన కెప్టెన్‌ను ప్రకటించలేదు. దాదాపుగా విండీస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ కెప్టెన్‌ కానున్నాడు. మార్చి 31 ఐపీఎల్ ఆరంభం కానుండగా.. ఏప్రిల్‌ 2న పంజాబ్‌ కింగ్స్‌తో కోల్‌కతా తలపడనుంది.  

Also Read: IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలకు తెలుగు హీరోయిన్స్.. ఫాన్స్‌కు పండగే ఇక!  

Aslo Read: Samsung Galaxy S23 Price Cut 2023: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. 37 వేలకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News