IPL 2021 KKR 100th IPL Match Win: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందింది. పటిష్టమైన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 10 పరుగుల తేడాతో ఓటమితో ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ 2021లో తమ ప్రస్థానాన్ని ప్రారభించింది. బౌలింగ్‌లో ఫలితాలు సాధిస్తేనే సన్‌రైజర్స్ విజయాలు ఖాయమని మరోసారి రుజువైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితిష్ రానా(80), రాహుల్ త్రిపాఠి(53) వేగవంతమైన అర్ధశతకాలతో రాణించడంతో ఇయాన్ మోర్గాన్ టీమ్ 187 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఓపెనర్లు, కెప్టెన్ డేవిడ్ వార్నర్, సాహా త్వరగా ఔట్ కావడంతో జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే రాణించినా 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు. అయితే ఇది కేకేఆర్ జట్టుకు 100వ విజయం. కేకేఆర్ యజమాని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తమ జట్టు వందో విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ్ క్రిష్ణ, దినేష్ కార్తీక్, నితిష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రస్సెల్, హర్భజన్ సింగ్, పాట్ కమిన్స్ రాణించారని, కేకేఆర్ అద్బుతంగా ఆడిందని జట్టు ఆటగాళ్లను ప్రశంసించాడు.
Also Read: MS Dhoni Fined: ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో ఓడిన CSK కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా
Good to hav our 100th IPL match win. Well done boys...@KKRiders @prasidh43 @DineshKarthik @NitishRana_27 #Rahul @Russell12A @harbhajan_singh ( good to see u even if briefly )@Sah75official @patcummins30 actually all were so good to watch.
— Shah Rukh Khan (@iamsrk) April 11, 2021
మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. ‘మా ఆటగాళ్లు అద్భుతం చేశారు. టాపార్డర్ ఆటగాళ్లు బ్యాటింగ్ సూపర్బ్. ముఖ్యంగా చెప్పాలంటే నితిష్ రాణా, త్రిపాఠి చాలా బాగా బ్యాటింగ్ చేశారు. బౌలర్లు సైతం తమవంతుగా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారని’ అభిప్రాయపడ్డాడు. తమ జట్టుకు IPL 2021 లో మంచి సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్ ఉన్నారని, మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇయాన్ మోర్గాన్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Gold Price Today 12 April 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం, మిశ్రమంగా వెండి ధరలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ వికెట్‌పై అన్ని పరుగులు చేయడం సాధ్యం కాదన్నాడు. అయితే కేకేఆర్ జట్టు బాగా ఆడిందని పేర్కొన్నాడు. బంతితో మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. త్వరగా వికెట్లు కోల్పోవడం తమకు ప్రతికూలాంశంగా మారిందని, జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే అద్బుతంగా బ్యాటింగ్ చేశారన్నాడు. అయితే బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించడం ఐపీఎల్ 2021లో ముందుకు సాగేందుకు సానుకూలాంశంగా మారుతుందన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook