IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం

ఐపీఎల్ (IPL 2020) లో  కెప్టెన్‌ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.

Last Updated : Oct 17, 2020, 05:44 AM IST
IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం

Mumbai Indians to 8-wicket win over Kolkata Knight Riders: న్యూఢిల్లీ: ఐపీఎల్ (IPL 2020) లో  కెప్టెన్‌ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ జట్టు ముంబై ఇండియన్స్ (MI) 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. (MI vs KKR) కేకేఆర్ ఇచ్చిన 149 పరుగుల టార్గెట్‌ను ముంబై ఈజీగా 16.5 ఓవర్లలోనే అంటే ఇంకా 19బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా టార్గెట్‌ను పూర్తిచేసింది. Also Read : Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌పై వేటు.. ఇయాన్ మోర్గాన్‌కు పగ్గాలు‌!

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, క్వింటన్ డీకాక్‌ (Quinton de Kock) ఇద్దరు ధాటిగా ఆరంభించారు. బౌండరీలే లక్ష్యంగా ప్రతర్థి జట్టు కేకేఆర్‌పై విరుచుకుపడ్డారు. డీకాక్ ‌( 78 నాటౌట్‌; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా అలరించగా.., రోహిత్‌ శర్మ ( 35; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించాడు. ఈ మ్యాచ్‌లో డీకాక్ 25 బంతుల్లోనే 8ఫోర్లు, 2సిక్స్‌లతో అర్థశతకం పూర్తిచేశాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో డీకాక్‌కు ఇది మూడో హాఫ్‌ సెంచరీ. అయితే.. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న డీకాక్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. కమిన్స్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో మెరువగా.. కెప్టెన్‌ మోర్గాన్‌ ( 29 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో కేకేఆర్ ఈమాత్రం స్కోరు చేయగలిగింది.  ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రోహిత్‌ సేన 16.5 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 149 పరుగుల టార్గెట్‌ను పూర్తిచేసింది. Also read: Sachin About Chris Gayle: యూనివర్సల్ బాస్‌కే చోటివ్వరా?: పంజాబ్ జట్టుకు సచిన్ చురకలు

ఇదిలాఉంటే.. ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబైకు ఇది ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు నాల్గో ఓటమి. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. ఇప్పటివరకు అన్ని జట్లు 8 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6 విజయాలతో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా.. 4 విజయాలతో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది.  Also Read : RCB vs KXIP match, IPL 2020: రెచ్చిపోయిన క్రిస్ గేల్, రాహుల్.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News