CSK VS MI: ఐపీఎల్ లీగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాలు మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు మాత్రం ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి. ఈక్రమంలో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్-2022 సీజన్ చరిత్రలో నిలిచిపోనుంది. ఎన్నో అంచనాలు ఉన్న జట్లు చతికిలపడగా..కొత్త జట్లు జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు గుజరాత్ జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇటు ముంబై జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ టీమ్‌కు 3 మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. ఈ మూడింట్లో గెలిచి సర్వంగా ఇంటికి వెళ్లాలని జట్టు భావిస్తోంది.
ఈక్రమంలోనే ఇవాళ ఐపీఎల్‌లో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈమ్యాచ్ ధోనీ సేనకు కీలకంగా మారింది. నేటి మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ మెరుగు పర్చుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇప్పటికీ చెన్నైకు ప్లే ఆఫ్స్ అవకాశాలున్నాయి. ఈమ్యాచ్‌లో గెలిచి రన్‌రేట్ పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన జట్టు ఏడింటిలో ఓడి..4 మ్యాచ్‌ల్లో గెలిచింది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచి ఇతర జట్లకు పోటీ ఇవ్వాలని భావిస్తోంది.
ముంబై టీమ్‌కు మాత్రం ఇది నామమాత్రపు మ్యాచ్. ఐనా ఈ మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని జట్టు భావిస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ టచ్‌లోకి వచ్చారు. సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం ఆ జట్టు తీరని లోటు అయిన..మిడిలార్డర్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తారని రోహిత్ ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లకు ఆడిన ఎంఐ తొమ్మింది మ్యాచ్‌ల్లో ఓడి..రెండింటిలో గెలిచింది.
మరోవైపు చెన్నై(CSK) జట్టు తన తదుపరి మ్యాచ్‌లను 15న గుజరాత్,20న రాజస్థాన్‌తో తలపడనుంది. ఇటు ముంబై(MI) జట్టు 17న హైదరాబాద్‌తో, 21న ఢిల్లీతో తలపడనుంది. మొత్తంగా ఈ సీజన్ ఐపీఎల్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. ఈసారి గుజరాత్, లక్నో జట్లే కప్ కొట్టే ఛాన్స్ ఉన్నాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు.
Also read:CM Jagan Serious: అలా చేస్తే జిల్లా బహిష్కరణే..సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook