భువనేశ్వర్ కుమార్ కన్నా అతడే మెరుగైన బౌలర్.. ఇప్పటికైనా కళ్లు తెరవండి: కనేరియా

Danish Kaneria says Its time to move on from Bhuvneshwar Kumar. భువనేశ్వర్ కుమార్ స్థానంలో స్వింగ్ మాస్టర్ దీపక్‌ చహర్‌ను తీసుకురావాలని పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 24, 2022, 06:01 PM IST
  • భువనేశ్వర్ కుమార్ కన్నా అతడే మెరుగైన బౌలర్
  • ఇప్పటికైనా కళ్లు తెరవండి
  • ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు
భువనేశ్వర్ కుమార్ కన్నా అతడే మెరుగైన బౌలర్.. ఇప్పటికైనా కళ్లు తెరవండి: కనేరియా

Danish Kaneria said Deepak Chahar is a better player than Bhuvneshwar Kumar: స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ దళాన్ని వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ముందుండి నడిపిస్తున్న విషయం తెలిసిందే. పేరుకు సీనియర్ అయినా గత కొన్ని మ్యాచులలో భువీ బౌలింగ్ పేలవంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2022లో అతడు రాణించలేదు. కీలక సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై చేతులెత్తేశాడు. 2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా ఏకంగా  25 పరుగులు ఇచ్చాడు. వేసిన మొదటి ఓవర్లోనే భారీ రన్స్ ఇచ్చి ఇంగ్లండ్ ఓపెనర్లు చెలరేగేలా చేశాడు. దాంతో ఇంగ్లీష్ ఓపెనర్లు లక్ష్యాన్ని ఊదేశారు. భువీ బాగా బౌలింగ్ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది.

టీ20 ప్రపంచకప్‌ 2022లో విఫలం అయినా టీమ్ మేనేజ్‌మెంట్ భువనేశ్వర్ కుమార్‌కు మద్దతుగా నిలిచింది. న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేసింది. న్యూజిల్యాండ్‌పై రెండు టీ20లు ఆడిన భువీ.. రెండో టీ20లో 12 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మూడో మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయకుండా 35 పరుగులు ఇచ్చాడు. దాంతో భువీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్‌లు సూచనలు ఇస్తున్నారు. తాజాగా పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా కూడా భువీపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భువనేశ్వర్ స్థానంలో స్వింగ్ మాస్టర్ దీపక్‌ చహర్‌ను తీసుకురావాలని అభిప్రాయపడ్డాడు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన భువనేశ్వర్ కుమార్‌కి వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న దీపక్‌ చహర్‌ వన్డే సిరీస్‌కు జట్టులోకి వచ్చాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే ఆక్లాండ్‌ వేదికగా శుక్రవారం ఉదయం జరగనుంది. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడూతూ... 'దీపక్‌ చహర్‌ అద్భుతమైన బౌలర్‌. అతడిని టీమిండియా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో చహర్‌ని తీసుకోవాలి. భువీ కంటే చహర్‌ అద్భుతంగా రాణించగలడు. పవర్‌ ప్లేలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తాడు. భువీకి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది' అని అన్నాడు. 

'ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్‌ఎం ఉమ్రాన్ మాలిక్ లాంటి ఎందరో పేస్‌ బౌలర్లు భారత జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2024 సమయానికి భువనేశ్వర్ కుమార్ ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం. నాలుగు ఓవర్లలో 35-40 పరుగులు ఇచ్చే బౌలర్ ఎందుకు. భువనేశ్వర్ స్థానంలో దీపక్‌ చహర్‌ను తీసుకురావాలి. భువనేశ్వర్ కన్నా చహర్ మెరుగైన ఆటగాడు. అతనికి టీ20ల్లో అవకాశాలు ఇవ్వాలి' అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. మొదటి వన్డేలో చహర్ ఆడటం దాదాపు ఖాయమే. 

Also Read: Ariyana Glory Hot Pics: అరియనా గ్లోరీ హాట్ షో.. టైట్ డ్రెస్‌లో ఘాటు అందాలు చూడతరమా!

Also Read: IND vs NZ: శాంసన్ ఇన్.. దీపక్, మాలిక్ డౌట్! న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News